*రాష్ట్రంలో 44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు* * అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా అర్హులందరికీ న్యాయం * రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్: గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీమతి సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సిపిఆర్‌వో శ్రీ జి. మల్సూర్‌లతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలు చేసి జి.ఓ. 103ను జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి వివరించారు. 2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు , 25001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, అదేవిధంగా 15001 నుంచి 25000 వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 , 15వేలలోపు సర్క్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజన్సీలకు 68 అక్రిడిటేషన్‌లు పొందుతాయని తెలిపారు. అలాగే 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానల్స్‌కు 32, వంద లోకల్ కేబుల్ ఛానళ్లకు 200 ,డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం! గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్‌పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు. కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్‌ను రన్‌వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్గుల్ కి చెందిన కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.4
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad Telangana Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Bai Daismuk Colony Nallakunta Secunderabad ECIL AS Rao Nagar2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 16 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై నమ్మకంతో బి-ఫామ్ అందజేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డికి, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.3
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV2