బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత చంద్రబాబుదే : గురుమూర్తి చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నాలుగో స్థానంలో నిలిచిందని, పార్లమెంట్ పరిధిలో అవనిగడ్డ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఇందుకు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గానికి విక్కుర్తి శ్రీనివాసరావు సమర్థవంతమైన నాయకుడని, ఆయనకు కృష్ణాజిల్లా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం కూటమి విజయాన్ని సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే అర్హులకు గృహాలు, పెన్షన్లు మంజూరు చేస్తుందని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని విమర్శించారు. బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని విమర్శించారు. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని అన్నారు. ఇలాంటి నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ఆయన సంకల్పమన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు.చల్లపల్లి మండలంలో 2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం నినాదంతో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన కార్యక్రమాన్ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగి రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం జరగాలని ఆకాంక్షించారు.

- భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్.* దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.1
- కుష్టు రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కాకినాడ ఎంపీజే ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతిపదిహేను రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ( sharp) RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూస్మశానవాటిక దగ్గర వున్న లెప్రసీ కాలనీ నందు 55 మంది లెప్రసీ రోగులకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు MPJ సానుభూతి పరురాలైన శ్రీమతి బీబి గారు వారి భర్త గారైనా స్వర్గీయ అలీ గారి జ్ఞాపకార్ధం ₹2500/- ఆర్ధిక సహాయం చేస్తున్నారు. డ్రెస్సింగ్ తో పాటు 39 మంది స్త్రీలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్ లు, చికెన్ బిర్యాని తోపాటు పరిశుభ్రతకు అవసరమయ్యే వస్తువుల (surf ప్యాకెట్ లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కొబ్బరి నూనె, షాంపూ ప్యాకెట్, soap) కిట్ కూడా లెప్రసి రోగులకు ప్రదానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు Md హలీం గారు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రటరీ Md ఉస్మాన్ షబ్బీర్ గారు, షాకీర్ గారు, దౌలానా బాషా గారు, Md ఇబ్రహీం గారు, కలీం గారు, Md రహ్మతుల్లా గారు పాల్గొన్నారు.1
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- టెలిగ్రామ్, వాట్సాప్‌లో స్టాక్ టిప్స్ పేరుతో మోసాలు–ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామంలో టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోవద్దని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్ స్టాక్ టిప్స్, భారీ రాబడుల హామీలతో ప్రజలను తమ వలలోకి లాగుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్లు నమ్మించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఎక్కువ లాభాలు వస్తాయి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ అంటూ వచ్చే సందేశాలు, అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల పెట్టుబడి సలహాలను ప్రజలు నమ్మవద్దని ఎస్సై సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు.ఇలాంటి మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజలు అత్యాశకు పోకుండా, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సూచించారు.1
- గంగా నదిలో చూస్తుండగానే మునిగిపోయిన బోటు చూస్తుండగానే మునిగిపోయిన బోటు.... బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఓ పడవ బోల్తా పడింది. అందులోని 21 మంది కూలీలు ప్రవాహంలో మునిగిపోయారు. SDRF వేగంగా స్పందించి 20 మందిని కాపాడగా మరో కార్మికుడి ఆచూకీ గల్లంతయింది. వరద నివారణ చర్యల్లో భాగంగా వారు నదిలోకి వెళ్లారని అధికారులు వెల్లడించారు. బోటు మునిగిపోయిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి....1