logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి… వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్‌లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్‌లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్‌పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

2 hrs ago
user_Mediya wgl medical wgl
Mediya wgl medical wgl
Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి… వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్‌లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో

పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్‌లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్‌పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    1
    వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర ముగిసింది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర ఆరు కిలోమీటర్లు ముందే దొంగలమర్రి వద్ద పాదయాత్రను ముగించి కారులో అంజన్న సన్నిధికి బండి సంజయ్ చేరారు. అప్పటికే రాత్రి 10 కావడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గుడి ముందే బండి సంజయ్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు చెల్లించారు. ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే అంజన్న ఆశీర్వాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అంజన్న దయతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుని ముక్కు చెల్లించేందుకు యాత్ర చేపట్టామని సంజయ్ తెలిపారు. నిబంధన ప్రకారం ఆలయాన్ని మూసివేశారని నిబంధనలు ఉల్లంఘించకుండా మూసివేసిన ఆలయం ముందే మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంజన్న ఆశీర్వాదయాత్ర రాత్రి 10 గంటలకు సాగింది. 15 గంటల పాటు చెప్పులు వేసుకోకుండా సాక్సులతో పాదయాత్ర చేసిన బండి సంజయ్ అలసిపోయారు. ఎండవేడితో అలసిపోయి మార్గమధ్యలో కొండన్నపల్లి వద్ద చెట్టు కింద 45 నిమిషాల పాటు సేద తీరారు. మార్గమధ్యలో రామడుగు మండలం కోనరావు పేట వద్ద డ్రోన్ కెమెరాతో తేనెటీగలు లేచి అంజన్న ఆశీర్వాద యాత్ర పై దాడి చేశాయి. యాత్ర వెనకలో ఉన్న పలువురు తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురికాగ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి అలసిపోయి అంజన్న సన్నిధికి చేరుకున్న బండి సంజయ్, కార్పొరేటర్లతో కలిసి అంజన్న గుడి ముందు మొక్కులు చెల్లించి అర్చకుల అశిర్వచనం తీసుకున్నారు.
    4
    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర ముగిసింది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర ఆరు కిలోమీటర్లు ముందే దొంగలమర్రి వద్ద పాదయాత్రను ముగించి కారులో అంజన్న సన్నిధికి బండి సంజయ్ చేరారు. అప్పటికే రాత్రి 10 కావడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గుడి ముందే బండి సంజయ్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు చెల్లించారు. ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే అంజన్న ఆశీర్వాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అంజన్న దయతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుని ముక్కు చెల్లించేందుకు యాత్ర చేపట్టామని సంజయ్ తెలిపారు. నిబంధన ప్రకారం ఆలయాన్ని మూసివేశారని నిబంధనలు ఉల్లంఘించకుండా మూసివేసిన ఆలయం ముందే మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. 
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంజన్న ఆశీర్వాదయాత్ర రాత్రి 10 గంటలకు సాగింది. 15 గంటల పాటు చెప్పులు వేసుకోకుండా సాక్సులతో పాదయాత్ర చేసిన బండి సంజయ్ అలసిపోయారు. ఎండవేడితో అలసిపోయి  మార్గమధ్యలో కొండన్నపల్లి వద్ద చెట్టు కింద 45 నిమిషాల పాటు సేద తీరారు. మార్గమధ్యలో రామడుగు మండలం కోనరావు పేట వద్ద డ్రోన్ కెమెరాతో తేనెటీగలు లేచి అంజన్న ఆశీర్వాద యాత్ర పై దాడి చేశాయి. యాత్ర వెనకలో ఉన్న పలువురు తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురికాగ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి అలసిపోయి అంజన్న సన్నిధికి చేరుకున్న బండి సంజయ్, కార్పొరేటర్లతో కలిసి అంజన్న గుడి ముందు మొక్కులు చెల్లించి అర్చకుల అశిర్వచనం తీసుకున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Sampathkumar neerudu
    1
    Post by Sampathkumar neerudu
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    1
    పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు.
3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు.
పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు.
జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Venkata laxmi Kothapalli
    4
    Post by Venkata laxmi Kothapalli
    user_Venkata laxmi Kothapalli
    Venkata laxmi Kothapalli
    భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిల్లలు పిల్లల తల్లి తండ్రులు అందరు పాల్గొన్నారు
    1
    ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిల్లలు పిల్లల తల్లి తండ్రులు అందరు పాల్గొన్నారు
    user_KingstarAshok KSR
    KingstarAshok KSR
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు.
మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • Post by Sampathkumar neerudu
    1
    Post by Sampathkumar neerudu
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.
    1
    ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన  గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి  వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు  ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.