బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హార్వెస్టర్ బావిలో పడ్డ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మరణించిన హార్వెస్టర్ డ్రైవర్ మధు మృతదేహాన్ని బయటకు తీసే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బావిని మంత్రి పరిశీలించారు. మృతదేహాన్ని పలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. మృతదేహం వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు. నందగిరి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సోమవారం నందగిరి గ్రామాన్ని సందర్శించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఫోన్ లో అధికారులను ఆదేశించారు.

- User1172Gangadhara, Karimnagar😡11 hrs ago
- తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.3
- తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.1
- వరంగల్ నగరంలోని సి.కె.ఎం కళాశాలలో ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధ్యాపకులు కలిసి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోర్సు వివరాలు, విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై అవగాహన కల్పించారు.1
- Post by Merugu Rajitha1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ ప్రాజెక్టులో 2023లో పిల్లర్లు కుంగిన ఘటనపై నేడు సీఎం స్థాయి సమీక్ష జరగనుంది. పిల్లర్ల సమీపంలో 22 మీటర్ల లోతు, ఒక మీటర్ వ్యాసంతో ఏర్పడిన బుంగ కారణంగానే కుంగుబాటు జరిగినట్లు ఇంజనీరింగ్ బృందాలు పేర్కొన్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 33 నెలలుగా పరీక్షలు కొనసాగుతుండగా, పునర్నిర్మాణ పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.1
- Post by Merugu Rajitha1