ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో బీజేపీ జాతీయ స్థాయి కీలక నాయకుడిగా ఎదిగి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ అండదండలతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలు మరియు ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో బీజేపీ జాతీయ స్థాయి కీలక నాయకుడిగా ఎదిగి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ అండదండలతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలు మరియు ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
- హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో పురుగులు పడ్డ భోజనం పెడుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు దిగారు. పాఠశాలలో నిత్యం వడ్డించే వంట సామాగ్రిని వారు స్వయంగా పరిశీలించి, భోజనంలో కనీస నాణ్యత లేదని మరియు పాఠశాలలో సరైన సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు వంటగదిలోని సామాగ్రిని తనిఖీ చేయగా, తెల్ల పురుగులు ఉన్న బియ్యంతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్ళిపోయిన కూరగాయలతో పాటు ఏమాత్రం నాణ్యత లేని నీళ్ళ సాంబార్‌ను వడ్డిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నాణ్యతలేని ఆహారాన్ని తినడం వల్లే తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దారుణ పరిస్థితికి బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సమాచారం అందుకున్న ఎంఈఓ కనుకతార గురుకుల పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.2
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొలీపాక రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో బండి సంజయ్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బుర్ర మల్లేశం, బండిపల్లి సునీతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.4
- వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.1
- ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.1
- పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.2
- తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్త పాలకమండలి ఇవాళ కొలువు తీరింది. పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కాగా, ఈ పాలకమండలి నియామకానికి సంబంధించి ఏపీకి చెందిన చిరంజీవి సతీమణిని ఎలా నిర్ణయిస్తారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుమనే యాదగిరిగుట్టలో కొత్త పాలక మండలి ప్రమాణస్వీకార ఉత్సవం జరగగా, చిరంజీవి సతీమణి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.1
- ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో బీజేపీ జాతీయ స్థాయి కీలక నాయకుడిగా ఎదిగి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ అండదండలతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలు మరియు ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.1