ప్రతి కేసులో శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు కృషి చేయాలి కోర్టు విధుల్లో నిర్లక్ష్యం లేకుండా కేసుల పరిష్కారంపై దృష్టి జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్ కోర్టు కేసుల్లో నిందితులకు శిక్ష పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులు, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు ముగిసే వరకు రుజువులు, పత్రాలు, సాక్షులను సమయానికి కోర్టుకు సమర్పించడంలో కోర్టు డ్యూటీ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. సాక్షులు, బాధితులకు కేసుపై అవగాహన కల్పించడంతో పాటు వారిని కోర్టుకు హాజరు పరచాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్లను సమీక్షించి వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

- సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో శనివారం ఉదయం జన్నారం బస్టాండు ప్రయాణికులతో రద్దీగా మారింది. దాదాపు పది రోజులపాటు సెలవులు రావడంతో వారు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో వారు ఇబ్బందులు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరారు.1
- Post by Ravi Poreddy1
- శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ హరి రావు గారు1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- Shivani thanda lo bore veyadam jarigindhi mla ramarao patel BJP party tarapu nundi dhanyawadalu jai bjp1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి ,సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2