Shuru
Apke Nagar Ki App…
వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Shareef pasha
వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
More news from తెలంగాణ and nearby areas
- రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఎం పార్టీ డిమాండ్. *రెండోరోజు సిపిఎం పోరుబాట* *రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఎం డిమాండ్* *నిద్ర వ్యవస్థలో విద్యుత్ అధికారులు* *ప్రతి కుంటలోకి సాగునీరు విడుదల చేయాలని ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గం MLA కడియం శ్రీహరి కి విజ్ఞప్తి... చిల్పూర్ మండలం జనగామ జిల్లా ఆగస్టు 04... రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *భారత కమ్యూనిస్టు పార్టీ [మార్క్సిస్టు] CPM చిల్పూర్ మండల కమిటీ* ఆధ్వర్యంలో *ఆగస్టు 1 నుండి 30 వరకు* మండలంలోని రైతుల వ్యవసాయ భూముల వద్ద *"పోరుబాట"* కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు రోజు *చిల్పూర్,వెంకటాద్రిపేట, వెంకటేశ్వర్లపల్లి* గ్రామాల్లో రైతులను కలిసి విద్యుత్ సమస్యలపై సర్వే చేసినం. చాలా చోట్ల ప్రాణాలకు తెగించే పరిస్థితులు కనిపించాయి. *గ్రామాల వారీగా సమస్యలు:* *1. చిల్పూర్:* - చిల్పూర్ ఉరి నుండి SC కాలనీకి పోయే రోడ్డు పక్కన బోరు దగ్గర అతి కిందికి .వైర్లు ఉగకుండా కర్రతో కట్టిన పరిస్థితి ఉన్నది బత్తిని రాజయ్య వ్యవసాయ బావి దగ్గర విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. - ఇలాంటి సమస్యలు గ్రామంలో ఇంకా చాలా ఉన్నాయని రైతులు తెలిపారు. *2. వెంకటాద్రిపేట:* - *పుల్యాల రాజిరెడ్డి బావిదగ్గర భూమికి మూడు పిట్ల ఎత్తులోనే ఉన్నాయి * 4 సంవత్సరాలుగా బావుల వద్ద చాలా ఇబ్బంది పడుతున్నాను. లైన్ మెన్ గణేష్ గారికి మరియు AE లకు మోరపెట్టుకున్న పట్టించుకునే పరిస్థితి లేదు. గొర్రెలు మేకలు మేపడం కోసం వచ్చి విద్యుత్ షాక్ గురైగాయాలు ఐనవి కేసీరెడ్డి సత్యవర్ధన్ రెడ్డి, శీవరాత్రి సమయ్య, బొక్కల మల్లయ్య గార్ల భూములలో 12-13 అడుగుల ఎత్తులోనే వైర్లు వేలాడుతున్నాయి. *3. వెంకటేశ్వర్లపల్లి :* గ్రామంలో లూజ్ లైన్ లు ఉన్నాయి అని రైతులు తెలిపారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇంత అవస్థలు పడుతున్నారు. *రైతులకు విజ్ఞప్తి ఈ క్రింది దాని ప్రకారం తప్పకుండ మనము ఉండాలి* *వ్యవసాయ బావులకు కొత్త కరెంట్ కనెక్షన్* విషయంలో 2026 ఫిబ్రవరి నుండి తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్ తీస్కొచ్చింది. ఇది రైతులకు చాలా ఉపశమనం ✊ *1. రైతు DD చెల్లించిన తర్వాత విద్యుత్ శాఖ వారు ఉచితంగా ఇచ్చేది ఏంటి?* కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం *రైతు దగ్గర నుండి ఎక్స్ట్రా డబ్బులు తీస్కోకూడదు* b950 విద్యుత్ శాఖ వారే చేయాల్సినవి: 1. *సర్వీస్ లైన్* - 1 KM లోపు ఉన్నట్లయితే లైన్ ఎక్స్టెన్షన్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది 2. *స్తంభాలు / పోల్స్* - గతంలో 3 పోల్స్ కంటే ఎక్కువైతే ₹45,000 వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టం రద్దు 3. *ట్రాన్స్‌ఫార్మర్* - కొత్త కనెక్షన్ల కోసం ప్రభుత్వం 75,686 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పెట్టింది. కాబట్టి TC ఖర్చు కూడా ప్రభుత్వానిదే 4. *24 గంటల ఉచిత కరెంట్* - 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా 24X7 కరెంట్ ఇస్తున్నారు b9503b4f5a6ed99ff3ee *2. రైతు ఏమి ఖర్చు పెట్టుకోవాలి?* ఇప్పుడు *లెక్కల ప్రకారం కాకుండా Load ఆధారంగా* ఛార్జీలు ఉన్నాయి 3b4f *రైతు చెల్లించాల్సింది:* - *Service Line Charges: ₹1,000 per kW* లేదా దాని భాగానికి - *ఉదాహరణ:* 5 HP మోటార్ = 3.7 kW. అంటే ₹1,000 x 4kW = ₹4,000 DD చెల్లించాలి. - *ORC - Operation and Maintenance Charges లేవు* b9503b4f *రైతు చెల్లించకూడనివి:* - స్తంభాల ఖర్చు - వైర్ల ఖర్చు - ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు - 1KM లోపు లైన్ ఎక్స్టెన్షన్ ఖర్చు *3. ముఖ్యమైన పాయింట్లు రైతుల కోసం* **అంశం** **పాత సిస్టం** **కొత్త సిస్టం 2026** **ఛార్జీ** దూరం ఆధారంగా Estimate. ₹45,000 వరకు Load ఆధారంగా. ₹1000/KW **3 పోల్స్** 3 దాటితే రైతు డబ్బు కట్టాలి ఉచితం **ORC** వసూలు చేసేవారు లేదు **కరెంట్** కొన్ని గంటలు 24 గంటలు ఉచితం 3b4fb950f3ee *ఎక్కడ అప్లై చేయాలి:* TSNPDCL / TSSPDCL ఆఫీసుల్లో *ఫిర్యాదుల కోసం:* 1912 టోల్ ఫ్రీ నెంబర్ d99f5a6e ఈ కార్యక్రమంలో *సీపీఎం పార్టీ బృందం* మండల కమీటి సభ్యులు పోలు సంపత్,ఊరడి బుచ్చి రాజ్ , తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. డిమాండ్.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది.1
- హనుమకొండలో ఆర్టీసీ ఎండీ పర్యటన.. స్క్రాబ్ విక్రయాలకు ఆదేశం హనుమకొండ సిటీ బస్ స్టేషన్‌లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లోకల్ డిపోను సందర్శించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిపోల్లో పేరుకుపోయిన స్క్రాబ్‌ను నెల రోజుల్లో నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. డిపోల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే లోకల్ డిపో ఎదురుగా నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి, నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా బిఆర్ఎస్ నేతల నివాళులు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఆయన మృతి పార్టీకి,తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.1
- రాష్ట్రంలో అసలు క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రి:డా. పాల్వాయి హరీష్ బాబు MLA సిర్పూర్ *రాష్ట్రంలో అసలైన క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రే! తన దగ్గర ఉన్న శాఖలను కూడా సరిగ్గా నిర్వహించలేని చేతకానితనంతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తున్నారు.* నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు కానీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గేస్తోంది. రేపు విద్యార్థులు కనుక రోడ్డెక్కి తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. *డా.పాల్వాయి హరీష్ బాబు గారు,* సిర్పూర్ శాసనసభ సభ్యులు1
- వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.1
- అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఆత్మహత్యాయత్నం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ మంగళవారం సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోలింగ్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.1