గురుకులాల్లో వసతి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట , ఏప్రిల్ 21(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ వంటశాలలు, సరకు ల నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల పరిస్థితిని సమీక్షించారు. పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యానికి అది కీలకమని సిబ్బందికి సూచించారు. వంటశాలలో ఆహార తయారీలో నాణ్యత, శుభ్రతపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. నిల్వ గదుల్లో ధాన్యాలు, ఇతర పదార్థాలను సురక్షితంగా నిల్వ చేసి, గడువు ముగిసిన వాటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ వారోత్సవాల భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై ప్రశ్నలు అడిగి, ప్రతిభ చూపిన వారిని అభినందించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంలో కీలకమని అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలపై కూడా ఆయన ఆరా తీశారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
గురుకులాల్లో వసతి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట , ఏప్రిల్ 21(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ వంటశాలలు, సరకు ల నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల పరిస్థితిని సమీక్షించారు. పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యానికి అది కీలకమని సిబ్బందికి సూచించారు. వంటశాలలో ఆహార తయారీలో నాణ్యత, శుభ్రతపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్
ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. నిల్వ గదుల్లో ధాన్యాలు, ఇతర పదార్థాలను సురక్షితంగా నిల్వ చేసి, గడువు ముగిసిన వాటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ వారోత్సవాల భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై ప్రశ్నలు అడిగి, ప్రతిభ చూపిన వారిని అభినందించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంలో కీలకమని అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలపై కూడా ఆయన ఆరా తీశారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Post by Mohammed javeed1
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1