logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"భూమాత క్షోభ "బాదంపప్పు బద్ద పై 40 సూక్ష్మ చిత్రాలు - నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.

2 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
    1
    విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల
జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    1
    యాంకర్ వాయిస్:
వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి.
కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి.
భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం
    1
    గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
    2
    బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు
    1
    సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    1 hr ago
  • బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
    1
    బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
    1
    బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు  76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి  ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి  పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.