Shuru
Apke Nagar Ki App…
సీఎం పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆల్పాహార పంపిణీ కార్యక్రమం. బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
జీ.మౌలాలి.
సీఎం పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆల్పాహార పంపిణీ కార్యక్రమం. బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1