కడపలో కొనసాగింపుపై మంత్రికి కృతజ్ఞతలు సిద్ధవటం,ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించడంపై ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య కడప ఇన్చార్జ్ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం కడపలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందించారు.గతంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్ధవటం,ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాలో విలీనం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు మండలాల్లో తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. దీనిపై కూటమి ప్రభుత్వం పునరాలోచించి రెండు మండలాలను కడపలోనే కొనసాగించేలా చర్యలు తీసుకుని గెజిట్ విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి సవితకు కుప్పాల విన్నవించారు.

- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2
- Post by Bondhu Suresh1
- తనకల్లు మండల పరిధిలోని హత్య కేసు కు సంబంధించిన నేరస్తులను కాలినడకన సబ్ జైలుకు తరలించారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట జరిగిన హత్యకు సంబంధించిన హంతకులను రిమాండ్ విధించడంతో స్థానిక పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నుండి సబ్ జైలుకు నడిపించుకుంటూ రిమాండ్ కు పంపించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి గ్రామీణ సర్కిల్ సిఐ నాగేంద్ర పాల్గొన్నారు.1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల సుంకు జంగన్న నగర పాలక హై స్కూల్ నందు సంక్రాంతి భోగి కనుమ పండుగ ముందస్తు వేడుకలు విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే క్రమంలో సృజనాత్మకతను వెలికి తీసే క్రమంలో రంగవల్లి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గెలుపొందిన వారికి ఐదు మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిని అందిస్తామని తెలిపారు. అదే క్రమంలో విద్యార్థులతో మేము సైతం అంటూ ఉపాధ్యాయులు కూడా రంగవల్లి పోటీలలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉపాధ్యాయులు. ముందస్తు భోగి వేడుకలను కూడా విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ కె అరవింద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమటం సుబ్బారావు రామ్మోహన్ సుబ్బరాజు మహేంద్ర ప్రభాకర్ అస్మా ప్రవీణ అరుణ తదితరులు విద్యార్థులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.3
- నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పార్థసారథి నగర్‌కు చెందిన దివ్యాంగురాలు ఊర్మిళ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద చీటీ వేశారు. చదువుల కోసం దాచుకున్న నగదును సదరు ఉపాధ్యాయుడు నెలల తరబడి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఆమె వీడియో విడుదల చేశారు.1
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1