ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఉట్నూరు ఐ టి డి ఏ)ఆఫీస్ ప్రారంభం ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం ఉట్నూర్: మండలంలోని లింగోజితండా ఎక్స్‌రోడ్డు గ్రామంలో నూతన ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఐటీడీఏ ఏపీఓ జాదవ్ వసంత్‌రావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, స్థానిక సర్పంచ్ మాయ జాదవ్, ఉపసర్పంచ్ హరినాయక్ జాదవ్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రైబల్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ముందుకు సాగాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు లాకావత్ రమేష్, కార్యదర్శి మాడవి మాణిక్‌రావు, చవాన్ రామేశ్వర్, కోశాధికారి జాదవ్ వసంత్‌రావు, ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్, ఆసిఫాబాద్–కొమురంభీం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం రాము, ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు రాథోడ్ అజయ్, ప్రచార కార్యదర్శి సిడం కైలాష్, రాథోడ్ నాందేవ్, జాయింట్ సెక్రటరీ జాదవ్ రవికిరణ్, భీమ్‌రావు, రవీందర్, మనోజ్, పీత నాయక్, దత్త తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఉట్నూరు ఐ టి డి ఏ)ఆఫీస్ ప్రారంభం ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం ఉట్నూర్: మండలంలోని లింగోజితండా ఎక్స్‌రోడ్డు గ్రామంలో నూతన ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఐటీడీఏ ఏపీఓ జాదవ్ వసంత్‌రావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, స్థానిక సర్పంచ్ మాయ జాదవ్, ఉపసర్పంచ్ హరినాయక్ జాదవ్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా
ట్రైబల్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ముందుకు సాగాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు లాకావత్ రమేష్, కార్యదర్శి మాడవి మాణిక్‌రావు, చవాన్ రామేశ్వర్, కోశాధికారి జాదవ్ వసంత్‌రావు, ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్, ఆసిఫాబాద్–కొమురంభీం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం రాము, ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు రాథోడ్ అజయ్, ప్రచార కార్యదర్శి సిడం కైలాష్, రాథోడ్ నాందేవ్, జాయింట్ సెక్రటరీ జాదవ్ రవికిరణ్, భీమ్‌రావు, రవీందర్, మనోజ్, పీత నాయక్, దత్త తదితరులు పాల్గొన్నారు.
- *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు * రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు3
- కొమ్మావార్ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్‌రెడ్డి బేల ప్రధాన రహదారిపై కొమ్మావార్ సంకేత్ నూతనంగా ఏర్పాటు చేసిన కొమ్మావార్ ట్రేడర్స్‌ను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్‌రావు వాంఖడే, కిసాన్ కాంగ్రెస్ బేల అధ్యక్షుడు గునశ్యామ్, బిక్కి గంగన్న, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.1
- Kamaraddy distik banswada me miladun nabi juloos police bhari bandubast,1
- ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షం.. రోడ్డు మార్గాలన్నీ జలమయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ జలమయంగా మారాయి. మార్కెట్ కు వచ్చిన ప్రజలు కాస్తంత ఇబ్బందులకు గురయ్యారు.1
- ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- ఎస్టీయూటీఎస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన 80 వసంతాల వైభవోత్సవం ఆదిలాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందం,ప్రధాన కార్యదర్శి జి.గజేందర్,ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాహెబ్ అలీ,జిల్లా అధ్యక్షుడు మురళీ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జాధవ్ రవికుమార్,ఆర్థిక కార్యదర్శి బూత్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.1