రోలుగుంట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌లో అద్భుత ఫలితాలు రోలుగుంట, ఏప్రిల్ 15: రోలుగుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్ ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు అసాధారణ ప్రదర్శన ప్రదర్శించారు. మొదటి సంవత్సర పరీక్షలకు 44 మంది హాజరైన వీరిలో 42 మంది ఉత్తీర్ణులై 96 శాతం పాసు శాతాన్ని సాధించారు. రెండు మంది మాత్రమే ఫెయిలయ్యారు. గరిష్ట మార్కులు 486 సాధించిన జె. పవిత్ర మొదటి సంవత్సర టాపర్‌గా నిలిచింది. రెండో సంవత్సర పరీక్షల్లో 33 మంది విద్యార్థినులు హాజరై, అందరూ పాసై 100 శాతం పాసు రేటు సాధించారు. 964/1000 మార్కులతో కె. సౌజన్య గరిష్ట మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణంగా మారింది. ఈ అద్భుత ఫలితాలపై కేజీబీవీ ప్రిన్సిపల్ తులసి మరియు ఉపాధ్యాయులు విద్యార్థినులను, తమ సిబ్బందిని ప్రశంసించారు. విద్యార్థినుల కషిపాటు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ తులసి చెప్పారు. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
రోలుగుంట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌లో అద్భుత ఫలితాలు రోలుగుంట, ఏప్రిల్ 15: రోలుగుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూప్ ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు అసాధారణ ప్రదర్శన ప్రదర్శించారు. మొదటి సంవత్సర పరీక్షలకు 44 మంది హాజరైన వీరిలో 42 మంది ఉత్తీర్ణులై 96 శాతం పాసు శాతాన్ని సాధించారు. రెండు మంది మాత్రమే ఫెయిలయ్యారు. గరిష్ట మార్కులు 486 సాధించిన జె. పవిత్ర మొదటి సంవత్సర టాపర్‌గా నిలిచింది. రెండో సంవత్సర పరీక్షల్లో 33 మంది విద్యార్థినులు హాజరై, అందరూ పాసై 100 శాతం పాసు రేటు సాధించారు. 964/1000 మార్కులతో కె. సౌజన్య గరిష్ట మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణంగా మారింది. ఈ అద్భుత ఫలితాలపై కేజీబీవీ ప్రిన్సిపల్ తులసి మరియు ఉపాధ్యాయులు విద్యార్థినులను, తమ సిబ్బందిని ప్రశంసించారు. విద్యార్థినుల కషిపాటు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ తులసి చెప్పారు. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Kundoori Prakash1
- monthly Passive income Start Cheyandi1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.1
- కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.1
- పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1