ఆలూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు.. కర్నూలు జిల్లా ఆలూరు ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి నేరుగా అన్న క్యాంటీన్ చెరుకుని పేదలకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో ప్రజలకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ వైకుంఠం జ్యోతి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు కూడా పాల్గొని ముఖ్యమంత్రికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76 సంవత్సరాలు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని ఇంత వయస్సు ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం రం కృషి చేయడం అభినందనీయమని ఇలాగే వందేళ్లు జన్మదిన వేడుకలు జరుపుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు.
ఆలూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు.. కర్నూలు జిల్లా ఆలూరు ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి నేరుగా అన్న క్యాంటీన్ చెరుకుని పేదలకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో ప్రజలకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ వైకుంఠం జ్యోతి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ
కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు కూడా పాల్గొని ముఖ్యమంత్రికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76 సంవత్సరాలు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని ఇంత వయస్సు ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం రం కృషి చేయడం అభినందనీయమని ఇలాగే వందేళ్లు జన్మదిన వేడుకలు జరుపుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు.
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం1
- Hi1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- తాగునీటి కొరత తీర్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు గుడీబండ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మండలంలో తాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మంగళవారం బోరు వేయించగా నీరు పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామికి, బాలల హక్కులకు కమిషన్ చైర్మన్ డాక్టర్ డి శ్రీనివాసమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు1
- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1