మేడిగడ్డకు 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పునరుద్ధరణపై కీలక నిర్ణయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇటీవలి కాలంలో బ్యారేజ్‌లో తలెత్తిన సమస్యలు, దెబ్బతిన్న నిర్మాణాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పునరుద్ధరణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన సందర్భంగా బ్యారేజ్ నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, నీటి నిల్వ సామర్థ్యంపై సమగ్రంగా ఆరా తీయనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేసే అవకాశముంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణను అత్యవసరంగా చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముండటంతో, ప్రాజెక్ట్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మేడిగడ్డకు 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పునరుద్ధరణపై కీలక నిర్ణయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇటీవలి కాలంలో బ్యారేజ్‌లో తలెత్తిన సమస్యలు, దెబ్బతిన్న నిర్మాణాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పునరుద్ధరణ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన సందర్భంగా బ్యారేజ్ నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, నీటి నిల్వ సామర్థ్యంపై సమగ్రంగా ఆరా తీయనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేసే అవకాశముంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణను అత్యవసరంగా చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముండటంతో, ప్రాజెక్ట్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పర్చేందుకు నిర్వహించిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థుల హావభావాలతో మొబైల్ ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.హెల్మెట్ ధారణతో సురక్షితంగా తమ గమ్యం చేరుకోవచ్చని అద్భుతంగా ప్రదర్శించారు.1
- Post by Rajitha Antharpula9
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు2
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని, వారిని ఇబ్బందులకు గురిచేయకూడదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన స్వగృహంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.1