logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం చెరుకుపల్లి ఎంపీటీవో కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎంపీడీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, తహసిల్దార్ పద్మావతి ప్రసంగిస్తూ, శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతతను ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు యోగాను తమ జీవనశైలిలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని ఎంపీడీవో మరోసారి స్పష్టం చేశారు.

9 hrs ago
user_M.Vijay Kishore
M.Vijay Kishore
Cherukupalle H/O Arumbaka, Bapatla•
9 hrs ago
a156e7fd-414f-4240-942c-bba9b43fbdf3
5f34b91b-c31d-49ad-b493-c2d5a0f0ae22
ddcf5164-2a17-4ba0-ba03-fb5ae261c908
e733ef30-0a92-44b0-aba1-aebd82df1402

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం చెరుకుపల్లి ఎంపీటీవో కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎంపీడీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, తహసిల్దార్ పద్మావతి ప్రసంగిస్తూ, శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతతను ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు యోగాను తమ జీవనశైలిలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని ఎంపీడీవో మరోసారి స్పష్టం చేశారు.

More news from Andhra Pradesh and nearby areas
  • అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ వేడుకలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, యోగా శరీరాకృతికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యతను చేకూర్చే అద్భుత విద్య అని కొనియాడారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో ఇది ఒక భాగంగా మారిందని ఆయన ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషితో యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ‘యోగాంధ్ర’ పేరిట దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ వేడుకలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, యోగా శరీరాకృతికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యతను చేకూర్చే అద్భుత విద్య అని కొనియాడారు.

భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో ఇది ఒక భాగంగా మారిందని ఆయన ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషితో యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ‘యోగాంధ్ర’ పేరిట దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    7 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక గంట పాటు జరిగిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పట్టణ ప్రముఖులు, మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి యోగాసనాలు వేశారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి.
    2
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక గంట పాటు జరిగిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పట్టణ ప్రముఖులు, మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి యోగాసనాలు వేశారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    8 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన నేతలు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాయి కృష్ణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు. పోలీసులు గాదే సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయభాను, బాధ్యులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధృవీకరించారు. సాయి కృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుండి వైసీపీకి అలవాటేనని, వైసీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవమని కూడా ఆయన పేర్కొన్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన నేతలు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాయి కృష్ణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు.

పోలీసులు గాదే సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయభాను, బాధ్యులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధృవీకరించారు. సాయి కృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుండి వైసీపీకి అలవాటేనని, వైసీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవమని కూడా ఆయన పేర్కొన్నారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    22 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు గారి విజన్‌కు అనుగుణంగా రాజధాని నగరం ప్రపంచం మెచ్చే విధంగా రూపుదిద్దుకుంటోందని, ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు గారి విజన్‌కు అనుగుణంగా రాజధాని నగరం ప్రపంచం మెచ్చే విధంగా రూపుదిద్దుకుంటోందని, ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • జగ్గయ్యపేటలోని బలుసుపాడు శ్రీ గురుధామ్ ధర్మక్షేత్రంలో ఆదివారం శ్రీ శివానంద గురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "శ్రీ హనుమత్ జ్ఞాన పుష్పాలు" అనే ఆధ్యాత్మిక డిజిటల్ మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడిటర్ శంకర్ బాబు మాట్లాడుతూ, శ్రీ గురుధామ్ ధర్మక్షేత్రం నుండి శివశ్రీ గెంటేల వెంకటరమణ సత్సంగంలో ఉపదేశించే ఆధ్యాత్మిక సందేశాలను ఈ డిజిటల్ మాసపత్రిక ద్వారా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
    2
    జగ్గయ్యపేటలోని బలుసుపాడు శ్రీ గురుధామ్ ధర్మక్షేత్రంలో ఆదివారం శ్రీ శివానంద గురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "శ్రీ హనుమత్ జ్ఞాన పుష్పాలు" అనే ఆధ్యాత్మిక డిజిటల్ మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడిటర్ శంకర్ బాబు మాట్లాడుతూ, శ్రీ గురుధామ్ ధర్మక్షేత్రం నుండి శివశ్రీ గెంటేల వెంకటరమణ సత్సంగంలో ఉపదేశించే ఆధ్యాత్మిక సందేశాలను ఈ డిజిటల్ మాసపత్రిక ద్వారా ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.
    user_Kakaraparthi ramesh
    Kakaraparthi ramesh
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    25 min ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది.
    user_పామర్తి రవి కుమార్
    పామర్తి రవి కుమార్
    General Store నూజివీడు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో జూన్ 20, శనివారం బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు రూ.50 వేల విలువైన టీషర్టులు, డ్రెస్ కోడ్ సామగ్రిని పంపిణీ చేశారు. అమరజీవి తూము ప్రకాశరావు స్మారక స్థూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు బత్తినేని నీరజ కళాకారులకు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమానికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. కాగా, ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
    1
    బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో జూన్ 20, శనివారం బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు రూ.50 వేల విలువైన టీషర్టులు, డ్రెస్ కోడ్ సామగ్రిని పంపిణీ చేశారు. అమరజీవి తూము ప్రకాశరావు స్మారక స్థూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు బత్తినేని నీరజ కళాకారులకు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమానికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.

కాగా, ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
    user_Romeet
    Romeet
    న్యాయవాది బోనకల్, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    1
    గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు.

రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు.

ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.

అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.