Shuru
Apke Nagar Ki App…
నకిరేకల్ పట్టణం లోమహారాజుల కాలనీ లో బోనాల ఏర్పాట్ల పరిశీలన నకిరేకల్ లోని ఎస్సీ కాలనీలో ఈనెల 27వ జరగనున్న ముత్యాలమ్మ తల్లి బోనాలు పండగ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు మరియు నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు ఇందులో తదితరులు నాయకులు పాల్గొన్నారు
మేడబోయిన శ్రీనివాస్
నకిరేకల్ పట్టణం లోమహారాజుల కాలనీ లో బోనాల ఏర్పాట్ల పరిశీలన నకిరేకల్ లోని ఎస్సీ కాలనీలో ఈనెల 27వ జరగనున్న ముత్యాలమ్మ తల్లి బోనాలు పండగ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు మరియు నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు ఇందులో తదితరులు నాయకులు పాల్గొన్నారు
More news from Telangana and nearby areas
- **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.2
- స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.1
- హరితహారం మొక్కలతో ఆహ్లాదకరమైన ప్రయాణం.................. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామపురం నుంచి చాకిరాల వరకు రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు పెద్దవిగా పెరిగాయి. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎండలో ప్రయాణించే వారికి నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి. మొక్కల సంరక్షణతో మరింత పచ్చదనం పెరగాలని స్థానికులు కోరుతున్నారు.1
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1