రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’: ప్రాణాలను నిర్లక్ష్యం చేయకండి.. -రామకృష్ణ కాలనీలో ఘనంగా అవగాహన సదస్సు. -పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు రవాణా శాఖల సమన్వయంతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో "అరైవ్ అలైవ్ 'రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి.. ముఖ్య అతిథి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. "డ్రంకన్ డ్రైవ్‌లో ఎవరైనా పట్టుబడితే రికమండేషన్ కోసం నాకు ఫోన్ చేయవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామసభల్లో భద్రతపై చర్చించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల ఛిన్నాభిన్నమైన కుటుంబాల గాథలు వింటే మనసు కలచివేస్తోందని అన్నారు. సర్పంచులు తమ గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలని సూచించారు. *హెల్మెట్ ధరించడం తప్పనిసరి: సిపి గౌస్ ఆలం* సిపి గౌష్ ఆలం మాట్లాడుతూ, జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు. 'రహ వీర్' పథకం కింద ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. *కన్నీళ్లు పెట్టించిన బాధితుల గాథలు* ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధితులు స్టేజీపై తమ ఆవేదనను పంచుకున్నారు. వారి మాటలు సభికులను కంటతడి పెట్టించాయి. గ్రామ సర్పంచ్ శ్వేత మాట్లాడుతూ, తమ గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంచుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అరైవ్ - అలైవ్ కార్యక్రమ గోడ పత్రికలు ఆవిష్కరించారు. రామకృష్ణ కాలనీ సర్పంచ్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో (వార్డు సభ్యులు, పదవి విరమణ పొందినఉద్యోగుల) తో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ తరుపున, ఎమ్మెల్యే చేతులమీదుగా పలువురికి హెల్మెట్లను అందజేశారు. అంతేకాకుండా స్థానికులకు, డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులచే రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల అధికారులు, సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- 18 సంవత్సరాల లోపు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ అధికారులు ఉన్నారు.1
- జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.4