logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ శాంతి, ఆరోగ్యం లక్ష్యంగా నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా:హన్మకొండ నగరంలోని సిబిసి చర్చ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ త్రీ నగరాల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ లక్ష్యంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.

4 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 hrs ago

ప్రపంచ శాంతి, ఆరోగ్యం లక్ష్యంగా నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా:హన్మకొండ నగరంలోని సిబిసి చర్చ్ వద్ద నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ త్రీ నగరాల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ లక్ష్యంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే పంటను విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
    3
    హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే పంటను విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    2
    *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం 
ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు
    1
    వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్  ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 day ago
  • ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    1
    ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 min ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    4
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో  మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో  కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    37 min ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ జిల్లా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో మోసపోయి వేల రూపాయలు నష్టపోతున్నారని ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు. శనివారం పర్వతగిరి మండలం ఏనుగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 7న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని, రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    3
    వరంగల్ జిల్లా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో మోసపోయి వేల రూపాయలు నష్టపోతున్నారని ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు. శనివారం పర్వతగిరి మండలం ఏనుగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 7న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని, రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.