వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వైద్య , ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య కేంద్రానికి ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన పరికరాలను ప్రారంభించారు . ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సారధ్యంలో ప్రజలకు నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా , ఆసుపత్రిలో అవసరమైన అధునాతన పరికరాలు , అన్ని చికిత్సలకు కావలసిన మెషీన్స్ తీసుకొస్తున్నాం అని అన్నారు.ప్రజా ప్రభుత్వం లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి కి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు . వైద్య శాఖ సిబ్బంది ప్రజల్లో ఉంటూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, మరిన్ని ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ,జిల్లా వైద్య అధికార సిబ్బంది , ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంద్రవెల్లి మండల కేంద్రంలో వైద్య , ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య కేంద్రానికి ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన పరికరాలను ప్రారంభించారు . ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సారధ్యంలో ప్రజలకు నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా , ఆసుపత్రిలో అవసరమైన అధునాతన పరికరాలు , అన్ని చికిత్సలకు కావలసిన మెషీన్స్ తీసుకొస్తున్నాం అని అన్నారు.ప్రజా ప్రభుత్వం లో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి కి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు . వైద్య శాఖ సిబ్బంది ప్రజల్లో ఉంటూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, మరిన్ని ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ,జిల్లా వైద్య అధికార సిబ్బంది , ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.1
- *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई* तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- ఆదిలాబాద్ జిల్లా : గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.4
- కామారెడ్డి: ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు, కల్వారల్ సమీపంలో జీఆర్పీ పైప్లాన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్లాన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి ఐదు రోజుల పాటు పైప్లాన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం3