నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం దేవపూర్ SI గంగారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం దేవాపూర్ SI గంగారం దేవపూర్ ఆధ్వర్యంలో దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగులగూడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 బైక్‌లను, 5 ఆటోలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు మరియు ఈ సందర్భంగా SI గంగారం మాట్లాడుతూ,సైబర్ మోసాలు మరియు సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.ఫేక్ కాల్స్,ఫిషింగ్ సందేశాలు,సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,హెల్మెట్ ధరించడం,సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని,మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని తెలిపారు.గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని,గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి మరియు సమాజానికి హానికరమని వివరించారు.యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం స్వీయరక్షణ మరియు నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు.గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అలాగే ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని, భద్రతను పెంచవచ్చని వివరించారు. పోలీసులు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు నేరాలను నివారించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో SI గంగారం మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం దేవపూర్ SI గంగారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం దేవాపూర్ SI గంగారం దేవపూర్ ఆధ్వర్యంలో దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగులగూడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 బైక్‌లను, 5 ఆటోలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు మరియు ఈ సందర్భంగా SI గంగారం మాట్లాడుతూ,సైబర్ మోసాలు మరియు సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.ఫేక్ కాల్స్,ఫిషింగ్ సందేశాలు,సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,హెల్మెట్ ధరించడం,సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని,మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని తెలిపారు.గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని,గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి మరియు సమాజానికి హానికరమని వివరించారు.యువత ఈ అలవాట్లకు
దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం స్వీయరక్షణ మరియు నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు.గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అలాగే ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని, భద్రతను పెంచవచ్చని వివరించారు. పోలీసులు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు నేరాలను నివారించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో SI గంగారం మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.1
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2
- అత్యవసరమైనా... నిత్యావసరమైనా వాగు దాటాల్సిందే! అనార్పల్లి–లక్మాపూర్ వాగులపై వంతెనల కోసం స్థానికుల ఆవేదన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడమే పెద్ద సవాలుగా మారుతోంది. శుక్రవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటారు. నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా, అత్యవసర వైద్య సేవలు పొందాలన్నా ఇదే మార్గం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు ఉప్పొంగితే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రైతులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక నిస్సహాయంగా వాగు దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.1
- తుమ్మిడి హెట్టి గ్రామపంచాయతి లో వర్షాలు బాగా పడటం వలన టం టం1
- *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.4