**ఓయూ లో లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఇద్దరు ఉద్యోగులు రిమాండ్ ** ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.
**ఓయూ లో లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఇద్దరు ఉద్యోగులు రిమాండ్ ** ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ
మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.5
- సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సంగారెడ్డిలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు1
- వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు1
- పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎనలేనివని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని, పేదలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాయ్ ముర్రే పాల్గొన్నారు1
- ఓయూలో ఘనంగా ప్రారంభమైన డుసిమస్ 2025 - 2026' ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.2