Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం మోదీ, సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పై గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం ప్రధాని మోదీ శనివారం సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను ప్రారంభించిన సందర్భంగా ఖమ్మంలో BJP శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం ప్రగతికి పెద్దపీట వేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 162కి.మీ మేర రూ.609 కోట్లతో నిర్మించరన్నారు.
Kasani Venkatesh
ఖమ్మం మోదీ, సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పై గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం ప్రధాని మోదీ శనివారం సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను ప్రారంభించిన సందర్భంగా ఖమ్మంలో BJP శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం ప్రగతికి పెద్దపీట వేస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 162కి.మీ మేర రూ.609 కోట్లతో నిర్మించరన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.2