Shuru
Apke Nagar Ki App…
చింతూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ B. R. Ambedkar 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసి అభివృద్ధికి విద్యే మార్గమని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ, మహిళా, వైద్య, లా కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Rc Tv Telugu
చింతూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ B. R. Ambedkar 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసి అభివృద్ధికి విద్యే మార్గమని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ, మహిళా, వైద్య, లా కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కురుపాం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో బిజెపి నాయకులు బోటు అనిల్ కుమార్, సీనియర్ నాయకులు నడుకూరు దూళికేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు దూలకేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు నేడు, ఏప్రిల్ 14. దేశ నిర్మాణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన అలుపెరగని కృషికి గుర్తుగా జరుపుకునే అంబేద్కర్ జయంతి నేడు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ గెంబలి ప్రదీప్ కుమార్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎన్ పురం శ్రీనివాసరావు, అద్దేపల్లి నిర్మల పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు1
- శ్రీకాకుళం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి అని కొనియాడారు. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన, చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారన్నారు. అందుకే ఎన్టీ రామారావు హయాంలో ఎస్సీ, బీసీ వర్గాల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రక్షణలు కల్పించారని, దానికి కొనసాగింపుగా త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోందని తెలిపారు. జిల్లాలోని సంజీవయ్య పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని, హాస్టల్ పాఠశాలల్లో మౌలిక వసతులు, స్వచ్ఛమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చట్టాలు సక్రమంగా అమలు జరిగినప్పుడే సామాన్యులకు మేలు: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు ఎన్ని గొప్ప హక్కులు కల్పించినా, వాటిని అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అనేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న కాలంలోనే అంబేద్కర్ కు 'భారతరత్న' దక్కిందని, ఆయన స్ఫూర్తితోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరి రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే ఆత్మాభిమానం, వ్యక్తి వికాసం సాధ్యమని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, చౌదరి బాబ్జి, రమణ మాదిగ, బొడ్డేపల్లి నరసింహులు మాదారపు వెంకటేష్, దుర్గారావు, మన్మధ, కొవ్వాడ సుశీల, రాయి వేణు, గేదెల రమణమూర్తి, టైక్వాండో శ్రీను, పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- దళిత, నిమ్నకులాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంభేడ్కర్ అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఆయన 135.వ.జయంతి సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన శిలావిగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నేటికి ఏనాటికైనా ఆయన రచించిన రాజ్యాంగం శిలా శాసనమని అన్నారు. ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.8
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నివాసం ఉంటున్న దేవి పాపా వింత అనారోగ్యంతో బాధపడుతుంది పుట్టిన్నుంచి వెన్నెముక వంకరగా నడవడానికి ఇబ్బంది పడుతూ రోజురోజుకు నరకయాతన అనుభవిస్తుంది. నిటారుగా నిలవలేని పరిస్థితి ఏర్పడింది వైద్య చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనస్థితిలో ఉండి తమ తల్లి కూతుర్ని కాపాడుకోవాలని అందరిని ప్రాధేయ పడుతోంది.1
- భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆపత్కాలంలో కాపాడేవారు అగ్నిమాపక కేంద్రం సిబ్బందని మండలపరిషత్ అభివృద్ధిఅధికారి కుప్పిలి ఫణీంద్ర కుమార్ పేర్కొన్నారు.మంగళవారం కోటబొమ్మాళి అగ్నిమాపకకేంద్రంలో జాతీయఅగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం తెలుసుకున్న వెంటనే వెళ్లి మంటలను అదుపుచేసి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండాకాపాడుతున్నారని అన్నారు.వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.7
- శ్రీకాకుళంజిల్లా రామచంద్రాపురం లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యేకూనరవికుమార్.ఆముదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పమాలలు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు.అంబేద్కర్ చూపిన మార్గంలోనే నేటి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి వర్గానికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4