నూతన సర్పంచులకు రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. గ్రామాల సమగ్రాభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు.నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్ఎం ఓల్డ్ క్యాంపస్)లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెండవ విడత శిక్షణ కార్యక్రమం 17-02-2026 నుండి 21-02-2026 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.రెండవ విడతలో భాగంగా అశ్వరావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచులు శిక్షణలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, పరిపాలన విధానాలు, బాధ్యతలు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.శిక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామపంచాయతీలకు అందుతున్న అభివృద్ధి పథకాల నిధులను సక్రమంగా వినియోగించి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిని సర్పంచులు నిరంతరం పర్యవేక్షించి చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందుతున్నదీ లేదో పరిశీలించాలని సూచించారు. అక్షరాస్యత పెంపు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.జిల్లాలో ఉన్న పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు పూబెల్లి, రోళ్ళపాడు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లోని కారుకొండ, జూలూరుపాడు ప్రాంతంలోని వ్యవసాయ విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేస్తే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు.సర్పంచులు పంచాయతీ శాఖకే పరిమితం కాకుండా గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇప్ప, ఇప్పపువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపద అభివృద్ధి, మేత సంపద పెంపుతో ప్రభుత్వ సబ్సిడీలుగ్రామాల్లో పొందే అవకాశముందని వివరించారు.18 నుండి 20 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా యంత్రాంగం నిర్వహించే ఇంటర్వ్యూలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సర్పంచులకు శిక్షణ కిట్లను అందజేశారు. గ్రామ పాలనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలు, చట్టపరమైన సూచనలు, అభివృద్ధి పథకాల సమాచార పత్రాలు తదితర అంశాలు కిట్లలో అందజేయబడినట్లు అధికారులు తెలిపారు.
నూతన సర్పంచులకు రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. గ్రామాల సమగ్రాభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు.నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్ఎం ఓల్డ్ క్యాంపస్)లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు విడతల వారీగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా
రెండవ విడత శిక్షణ కార్యక్రమం 17-02-2026 నుండి 21-02-2026 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.రెండవ విడతలో భాగంగా అశ్వరావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 233 మంది నూతన సర్పంచులు శిక్షణలో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, పరిపాలన విధానాలు, బాధ్యతలు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.శిక్షణలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సవివరంగా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామపంచాయతీలకు అందుతున్న అభివృద్ధి పథకాల నిధులను సక్రమంగా వినియోగించి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి మౌలిక
సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వీధిదీపాలు, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిని సర్పంచులు నిరంతరం పర్యవేక్షించి చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందుతున్నదీ లేదో పరిశీలించాలని సూచించారు. అక్షరాస్యత పెంపు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.జిల్లాలో ఉన్న పర్యాటక అవకాశాలను సద్వినియోగం చేసుకుని గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు పూబెల్లి, రోళ్ళపాడు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లోని కారుకొండ, జూలూరుపాడు ప్రాంతంలోని వ్యవసాయ విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేస్తే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు.సర్పంచులు పంచాయతీ శాఖకే పరిమితం కాకుండా గ్రామంలో జరుగుతున్న ప్రతి
అభివృద్ధి కార్యక్రమంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇప్ప, ఇప్పపువ్వు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయ వనరులు సృష్టించవచ్చని, పశుసంపద అభివృద్ధి, మేత సంపద పెంపుతో ప్రభుత్వ సబ్సిడీలుగ్రామాల్లో పొందే అవకాశముందని వివరించారు.18 నుండి 20 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా యంత్రాంగం నిర్వహించే ఇంటర్వ్యూలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సర్పంచులకు శిక్షణ కిట్లను అందజేశారు. గ్రామ పాలనకు అవసరమైన మార్గదర్శక పుస్తకాలు, చట్టపరమైన సూచనలు, అభివృద్ధి పథకాల సమాచార పత్రాలు తదితర అంశాలు కిట్లలో అందజేయబడినట్లు అధికారులు తెలిపారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.1
- తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.2
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.3