Shuru
Apke Nagar Ki App…
అనంతగిరి మండలం కాశీపట్నం రైతు భరోసా కేంద్రం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకు నుంచి ఎస్.కోట వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతినగా, అందులో ఉన్న ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Shyam
అనంతగిరి మండలం కాశీపట్నం రైతు భరోసా కేంద్రం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకు నుంచి ఎస్.కోట వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతినగా, అందులో ఉన్న ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరుకానున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల సమయంలో అరకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- ఒరిస్సా సరిహద్దు నుంచి వచ్చిన మరో ఏనుగు1
- పోలవరం జిల్లా... గంగవరం మండలం కొమరవరం గ్రామం నల్లగొండ అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్టు సమాచారం. తాళ్లపాలెం అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వెళ్లినట్టు తెలుస్తుంది. పెద్దపులి కదలికలపై పొలాల్లోకి వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.1
- చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం పాలకొండలోని కోటదుర్గ అమ్మ వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకుడు లక్ష్మీప్రసాదుశర్మ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుందన్నారు. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి పూజలనంతరం ఆలయాన్ని మూసివేసి బుధవారం ఉదయం 6 గంటలకు తెరుస్తామని పేర్కొన్నారు.1
- Post by Shyam1