Shuru
Apke Nagar Ki App…
విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మంగళవారం రాజవొమ్మంగిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఐటీయూ నేతలు రామరాజు, శ్రీనుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అల్లూరి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి, ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను తీవ్రంగా వ్యక్తపరిచారు.
Shyam
విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మంగళవారం రాజవొమ్మంగిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఐటీయూ నేతలు రామరాజు, శ్రీనుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అల్లూరి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి, ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను తీవ్రంగా వ్యక్తపరిచారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.1
- చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం పాలకొండలోని కోటదుర్గ అమ్మ వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకుడు లక్ష్మీప్రసాదుశర్మ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుందన్నారు. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి పూజలనంతరం ఆలయాన్ని మూసివేసి బుధవారం ఉదయం 6 గంటలకు తెరుస్తామని పేర్కొన్నారు.1
- మార్చి 3 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ గుడ్డిమీదపేట, చొక్కరవానిపేట మరియు సూరాడవాని పేట సమీపంలో సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు తన సొంత నిధులతో యువకులు ఆడుకునేందుకు క్రికెట్ మైదానాన్నిఏర్పాటుచేసిమంగళవారం ఘనంగాప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత యువకుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని మరింత సానపెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా పంచాయతీలో రెండు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, క్రీడాకారులకు అవసరమైన సహాయం తన వంతుగా ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. మైదానం ఏర్పాటు చేసిన దాసురాజుకు పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.4
- నరసన్నపేట : నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు1
- 🙏😭1
- జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.4
- Post by Shyam1
- అల్లూరి ఏజెన్సీలో పోలీసుల తనిఖీల్లో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ లమడంపల్లి నుంచి గంజాయి అక్రమ రవాణాపై పోలీసులకు ముందస్తు సమాచారంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. లోతు గడ్డ బ్రిడ్జి సమీపంలో సుమారు 11 కేజీల లిక్విడ్ గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్‌కి తరలించామని చింతపల్లి సీఐ వినోద్ తెలిపారు.1
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా,వీరఘట్టం మండలం తూడి గ్రామంలో జీడి మామిడి పంటలకు అంటుకున్న మంటలు.సుమారు పది ఎకరాల్లో పంట నష్టం.గ్రామస్తుల అప్రమత్తo అవడంతో అదుపులోకి మంటలు.అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి పూర్తిగా మంటల్లో అదుపులోకి తీసుకువచ్చిన సిబ్బంది..1