Shuru
Apke Nagar Ki App…
భీంపూర్ మండలంలోని ధనోరా వాగు లో-లెవల్ వత్తేనపై నుండి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆవు భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ధనోరా వాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటి వల్ల స్థానిక లో-లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీంతో వంతెనకు ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక ఆవు, నీటి ప్రవాహ వేగానికి తట్టుకోలేక వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలెవరూ వంతెన దాటే సాహసం చేయవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Jakkula Sujith
భీంపూర్ మండలంలోని ధనోరా వాగు లో-లెవల్ వత్తేనపై నుండి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆవు భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ధనోరా వాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటి వల్ల స్థానిక లో-లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీంతో వంతెనకు ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక ఆవు, నీటి ప్రవాహ వేగానికి తట్టుకోలేక వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలెవరూ వంతెన దాటే సాహసం చేయవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- దాబా (B) బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలి: గిరిజన సంఘం.. గాదిగూడ మండలం దాబా (B) పంచాయతీ పరిధిలోని పౌనూర్, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాలకు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు, రోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు పెంధోర్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.1
- పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు(9, 10) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పశువు కాపరులు, చేపల వేటకు వెళ్లే జార్లర్లు సైతం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.1
- ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఖానాపూర్ తర్లపాడు వెళ్లే వాహనదారులు చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని స్థానికులు పేర్కొన్నారు1
- రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.1
- అదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను నీరు నిలువున్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ గారు , సానిటరీ ఇన్స్పెక్టర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించి జెసిబి ల సహాయంతో నీటిని తొలగించి ప్రత్యేక టోల్ ఫ్రీ 9000018842 నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటారని మూడు షిఫ్టులతో కూడిన టీం లు ఏర్పాటు చేయబడి ఉన్నాయని తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.2
- కడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలిన అధికారులు నిర్మల్ జిల్లా లో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటివరకు 94137 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు మొదలుతున్నారు. ఇంట్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.1
- వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.1