logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు మోడల్ స్కూల్‌ & జూనియర్‌ కళాశాల విద్యార్థి బాచి ఎంపిక MLG: ములుగు మండలం బండారుపల్లి PM శ్రీ మోడల్ స్కూల్‌ & జూనియర్‌ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. దక్షిణ జోనల్‌ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు. 60 మీటర్ల పరుగులో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి పతకం అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సింగారం దేవకి, అధ్యాపకులు అభినందించారు.

1 hr ago
user_MAHI
MAHI
ములుగు, ములుగు, తెలంగాణ•
1 hr ago
280e1f8e-da64-4a53-b195-f3a7c2e60ca3

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు మోడల్ స్కూల్‌ & జూనియర్‌ కళాశాల విద్యార్థి బాచి ఎంపిక MLG: ములుగు మండలం బండారుపల్లి PM శ్రీ మోడల్ స్కూల్‌ & జూనియర్‌ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. దక్షిణ జోనల్‌ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు. 60 మీటర్ల పరుగులో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి పతకం అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సింగారం దేవకి, అధ్యాపకులు అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
    1
    కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ
MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    1
    హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    1
    *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*

తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు

ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ

*వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*
తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు
ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ
స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి
ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    2
    సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    1 hr ago
  • రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    4
    రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు.  దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    1
    మరి చెట్టుకు మర్రి కల్లు.. 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. 
కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... 
బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్  కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు  వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద  వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి  పూడిక తో ఉండడంతో  ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి  నీరు సరిపోక పోవడంతో  తన  బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి  పెద్ద వేరు తెగి పోవడం  వల్ల, వేరు  నుంచి మూడు నాలుగు రోజులుగా  మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట..... MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.
    1
    గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట.....
MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    21 hrs ago
  • ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    1
    ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని
హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి
10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.