కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకల బందోబస్తు,సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా....ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా,కదిరిలో మంగళవారం జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ గారు రథోత్సవ మార్గం, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రదేశాలు మరియు వేడుకలు నిర్వహించే ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్ర తో పాటు ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లపై ఎస్వి ఫంక్షన్ హాల్ లో పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బందితో సమీక్షించారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని , ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రథోత్సవం జరిగే ప్రధాన మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిరంతరం డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం వృద్ధులు, మహిళలు మరియు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా పార్కింగ్ ప్రదేశాల్లో క్రమ పద్ధతిలో వాహనాలు నిలిపే విధంగా చూడాలన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రథోత్సవ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నందున వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భక్తులకు సూచించారు. భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో రథోత్సవ వేడుకలను దర్శించుకునేలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకల బందోబస్తు,సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా....ట్రాఫిక్ ఆంక్షలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా,కదిరిలో మంగళవారం జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ గారు రథోత్సవ మార్గం, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రదేశాలు మరియు వేడుకలు నిర్వహించే ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్ర తో పాటు ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లపై ఎస్వి ఫంక్షన్ హాల్ లో పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బందితో సమీక్షించారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని , ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు
జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రథోత్సవం జరిగే ప్రధాన మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిరంతరం డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం వృద్ధులు, మహిళలు మరియు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా పార్కింగ్ ప్రదేశాల్లో క్రమ పద్ధతిలో వాహనాలు నిలిపే విధంగా చూడాలన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రథోత్సవ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నందున వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భక్తులకు సూచించారు. భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో రథోత్సవ వేడుకలను దర్శించుకునేలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Magathala Siddhartha2
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- ఈ కాకమ్మ కబుర్లకు ఎలాంటి కొరతే లేదు! 🤣🔥1
- తిరుపతి. న్యూస్. అలిపిరి తనిఖీ కేంద్రం లో భారీగా నగదు స్వాధీనం. భారీ నగదుతో కారులో తిరుమలకు వెళ్తున్న ఓ వ్యక్తి. గుర్తించిన టీటీడీ విజిలెన్స్. తిరుమలలో కాయిన్స్ కోసం తీసుకోవడానికి నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపిన ఓ వ్యక్తి. అధిక మొత్తం నగదు కావడంతో నగదు తెచ్చిన వ్యక్తిని, నగదును అలిపిరి పోలీసులకు అప్పగింత. అలిపిరి పోలీస్ స్టేషన్ కు చేరిన వ్యక్తిని యజమాని ఎవరు...? ఎందుకు తీసుకెళుతున్నారు...?అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1