Shuru
Apke Nagar Ki App…
అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం. కొవ్వొత్తి ర్యాలీతో నిరసన తెలిపిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో అమరావతి రాజధాని ఏర్పాటుకు శ్రీకారం చుట్టబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు ఎదుర్కొన్న అమరావతి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ప్రజా రాజధానిగా పార్లమెంటులో ఆమోదం పొంది చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. ఈ శుభ సందర్భంగా కందుకూరులో సంబరాలు నిర్వహించి, దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచాము.
Kumar
అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం. కొవ్వొత్తి ర్యాలీతో నిరసన తెలిపిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో అమరావతి రాజధాని ఏర్పాటుకు శ్రీకారం చుట్టబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు ఎదుర్కొన్న అమరావతి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో ప్రజా రాజధానిగా పార్లమెంటులో ఆమోదం పొంది చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. ఈ శుభ సందర్భంగా కందుకూరులో సంబరాలు నిర్వహించి, దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచాము.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రైల్వేకోడూరు..... తిరుపతి జిల్లా. హర్ష వీణపై జనసేన కార్యకర్త దాడి. రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఘటన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కార్యకర్తలు టోల్గేట్ సమీపంలో అమరావతి సంబరాలు. హర్ష వీణ అక్కడే ప్రత్యక్షమవడంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసుల చేతిలో లారీ లాక్కుని ఆమెపై దాడి. ఎందుకు నాపై దాడి చేశారంటూ నిలదీత.1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్‌లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.1
- ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు (మం) లక్ష్మీపురం నూజివీడు రోడ్డు లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాటరింగ్ పనికి నూజివీడు వెళ్ళిన తిరిగి వస్తున్నప్పుడు జరిగిన ఘటన.. పల్సర్ బైక్ పై తిరువూరు వచ్చేందుకు ప్రయాణించిన 5గురు మైనర్లు.. లక్ష్మీపురంలో ఒకరిని ఇంటి వద్ద దింపేందుకు జాతీయ రహదారి పైన బైక్ దిగిన మైనర్లు.. వెనుక నుండి ఢీకొన్న గుర్తుతెలియని లారీ.. సంఘటన స్థలంలోనే ఇద్దరు నక్కా ఈశ్వర్ (16), మోదుగు సన్నీ (17) అక్కడికక్కడే మృతిచెందారు.. ఇద్దరి మృతదేహాలు ఛిద్రంగా మారడంతో స్థానికంగా నెలకొన్న భయానక వాతావరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. దైదా వెంకటేశ్వరరావు (16), ధారావతు రామ్ చరణ్ (17) లకు తీవ్రగాయాలు. బాలమర్తి చరణ్ తేజ్ (17)పరిస్థితి విషమం అత్యవసర చికిత్సకై విజయవాడకు తరలింపు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ కె. గిరిబాబు.. పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించిన మృతదేహాలు..1