జైనథ్‌లో "పోలీస్ మీకోసం" అవగాహన కార్యక్రమం - యువతకు హెల్మెట్ల పంపిణీ జైనథ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పిప్పరవాడ గ్రామంలో _“పోలీస్ మీకోసం”_ అవగాహన కార్యక్రమం నిర్వహించారు._ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్_ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. _జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సై గౌతమ్_ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, జైనథ్ ఉమ్మడి మండలాల సర్పంచులు, వ్యాపారవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో నేరాల నివారణకు ప్రతి ఇంటి వద్ద _సీసీ కెమెరాలు_ ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎస్పీ అఖిల్ మహజాన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాల్గొన్న వారందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.
జైనథ్‌లో "పోలీస్ మీకోసం" అవగాహన కార్యక్రమం - యువతకు హెల్మెట్ల పంపిణీ జైనథ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పిప్పరవాడ గ్రామంలో _“పోలీస్ మీకోసం”_ అవగాహన కార్యక్రమం నిర్వహించారు._ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్_ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. _జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సై గౌతమ్_ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, జైనథ్ ఉమ్మడి మండలాల సర్పంచులు, వ్యాపారవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో నేరాల నివారణకు ప్రతి ఇంటి వద్ద _సీసీ కెమెరాలు_ ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎస్పీ అఖిల్ మహజాన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాల్గొన్న వారందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.1
- వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు1
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.1
- ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..* ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం బాధాకరం.. *తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బస్టాండ్ దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది..* *ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు.. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు ఉన్నారు..1