Shuru
Apke Nagar Ki App…
సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్.
Shareef pasha
సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్.
More news from తెలంగాణ and nearby areas
- బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.1
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- ముమ్మాటికి డబుల్ బెడ్ రూములు మా కెసిఆర్ కట్టినవే ఇద్దరు మంత్రులను ఒక ఆట ఆడుకున్న : హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం2
- ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా: గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.3
- అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.1
- మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.1