Shuru
Apke Nagar Ki App…
ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న కౌన్సిలర్ బాణాల ప్రసన్న శ్రీనివాస్ మిషన్ భగీరథ పైపుల లీకేజ్ పోవడంతో గత ఐదు రోజులు వార్డు ప్రజలు ఇబ్బందులను గమనించిన స్థానిక కౌన్సిలర్ బాణాల ప్రసన్న శ్రీనివాస్ ట్యాంకర్లతో వార్డు ప్రజలకు నీటిని అందించారు పైప్ లైన్ లీకేజ్ ను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వార్డులో ఎలాంటి సస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సర్వపురం ఎస్సీ కాలనీలో నీటి అవసరాలకు బోర్ వేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో మరికొన్ని బోర్లు కూడా కాలనీలో వేయిస్తానని హామీ ఇచ్చారు
Raviteja Journalist
ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న కౌన్సిలర్ బాణాల ప్రసన్న శ్రీనివాస్ మిషన్ భగీరథ పైపుల లీకేజ్ పోవడంతో గత ఐదు రోజులు వార్డు ప్రజలు ఇబ్బందులను గమనించిన స్థానిక కౌన్సిలర్ బాణాల ప్రసన్న శ్రీనివాస్ ట్యాంకర్లతో వార్డు ప్రజలకు నీటిని అందించారు పైప్ లైన్ లీకేజ్ ను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వార్డులో ఎలాంటి సస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సర్వపురం ఎస్సీ కాలనీలో నీటి అవసరాలకు బోర్ వేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో మరికొన్ని బోర్లు కూడా కాలనీలో వేయిస్తానని హామీ ఇచ్చారు
More news from తెలంగాణ and nearby areas
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ మాల ధరించిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి రాకుండా హెడ్‌మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకున్నట్లు సమాచారం. మాల తీసివేసి పాఠశాలకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా హెడ్‌మాస్టర్ దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు. హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1