logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేండ్లగూడ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భారీ విరాళం జన్నారం మండల కేంద్రంలోని రేండ్లగూడ గ్రామ అభివృద్ధిలో ఆధ్యాత్మికతను జోడిస్తూ,స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి గ్రామ మాజీ సర్పంచ్ నెమలికొండ ఆశారాజు తన వంతు సాయంగా ₹50,116 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించేందుకు ఆలయ నిర్మాణం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని, ఆశారాజు చేసిన ఆర్థిక సాయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కమిటీ కోరింది.

2 hrs ago
user_Naveen journalist
Naveen journalist
Local News Reporter ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
2 hrs ago
e21d53b6-024a-43fc-a606-5d740aba7ac4

రేండ్లగూడ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భారీ విరాళం జన్నారం మండల కేంద్రంలోని రేండ్లగూడ గ్రామ అభివృద్ధిలో ఆధ్యాత్మికతను జోడిస్తూ,స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి గ్రామ మాజీ సర్పంచ్ నెమలికొండ ఆశారాజు తన వంతు సాయంగా ₹50,116 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించేందుకు ఆలయ నిర్మాణం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని, ఆశారాజు చేసిన ఆర్థిక సాయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కమిటీ కోరింది.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్చత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం లోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు.
    1
    ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్చత  పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం లోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    51 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    మంచిర్యాల జిల్లా//
దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    4
    కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు.
తంగళ్ళపల్లి మండలంలో
మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    17 hrs ago
  • అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    1
    అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రక్త పరీక్షలు నిర్వహించే చోట భయభ్రాంతులకు గురిచేశాయి. ఆస్పత్రిలో కోతుల బెడద రోజురోజుకు మితిమీరి పోతోందని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే కోతులు ఎప్పుడేం చేస్తాయోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వహకులు, జిల్లా యంత్రాంగం కోతుల బెడద లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రక్త పరీక్షలు నిర్వహించే చోట భయభ్రాంతులకు గురిచేశాయి. ఆస్పత్రిలో కోతుల బెడద రోజురోజుకు మితిమీరి పోతోందని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే కోతులు ఎప్పుడేం చేస్తాయోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వహకులు, జిల్లా యంత్రాంగం కోతుల బెడద లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.
    1
    సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి అంబేద్కర్ చౌక్ లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలం, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, గడ్డం నర్సయ్య, పంబాల దేవరాజు, లక్ష్మణ్, రాగుల రాములు కత్తెర దేవదాస్ కంసాల మల్లేశం పండుగ రవి తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    54 min ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.