logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం క్షమించరాని నేరం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా , తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు ఎంపీ తేజస్వీ సూర్యపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి. సభలో తెలంగాణ నుండి 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు దిష్టిబొమ్మల్ల మిగిలారు సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు తగిన గుణపాఠం చెప్పేవారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ వాఖ్యలపై సమాధానం చెప్పాలి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 👉 మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకపూరితమైనవని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్ తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంతేకాకుండా, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తేజస్వీ సూర్యను కోరారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుండటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అహంకారపూరిత వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అంటే పార్లమెంట్‌ను, 140 కోట్ల దేశ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు అదే తరహాలో ఉంటే, విభజన బిల్లుకు అప్పట్లో బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. నాడు మోడీ అయినా, నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారని అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అవమానకరంగా మాట్లాడుతుంటే అదే పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటు . తెలంగాణలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఢిల్లీలో రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తుచేశారు.తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించకుండా సభలో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు దిష్టి బొమ్మల్లా మిగిలారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, సహాయమంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. ఒకవేళ అదే సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంగతి ఏమిటో తేల్చేవారు, పార్లమెంట్ ను స్థంబింపజేసి వారికీ తగిన సమాధానం ఇచ్చేవారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు, పార్లమెంట్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా ప్రజలు సహించరని, బీజేపీ నేతలు కొరవి తో తలగోక్కోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు పై బీజేపీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.

7 hrs ago
user_MOHAMMAD SHAIK HUSSAIN
MOHAMMAD SHAIK HUSSAIN
బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
7 hrs ago
cee6aed7-3c32-4906-9f9f-9a58a77fe0b5

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer భైంసా, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :16.04.2026
కామారెడ్డి జిల్లా 
గురువారం 
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్,  ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.
రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు.  అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    4
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.
అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. 
అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్  ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు  తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    1
    కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.  ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ​రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు ​గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ​"మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి" ​ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.
    3
    అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం.
​రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు
​గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
​"మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి"
​ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో  ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.