logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వినాయక నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి నేరేడు చెరువులో మట్టి గుంతలు గుర్తించక నీటిలోకి దిగిన విద్యార్థులు విషాద ఘటనతో పెద్దకంజర్లలో విషాదఛాయలు పటాన్‌చెరు, శురు ప్రతినిధి సెప్టెంబర్‌ 16: వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దకంజర్లలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు విద్యార్థులు నీటిలోకి దిగారు. చెరువులో మట్టి కోసం తీసిన గుంతలు ఉండటాన్ని గమనించకపోవడంతో లోతైన నీటిలోకి వెళ్లిన విద్యార్థులు ఈత రాక మునిగిపోయినట్లు సమాచారం. మృతులను నర్సింహా (21), తేజ (17), సిద్దంత్ (17), గణేష్ (18), సుమంత్ రెడ్డి (17), ఉదయ్ కిరణ్ (22) గుర్తించారు. వీరిలో సుమంత్‌, గణేష్‌ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్‌కిరణ్‌ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్‌కుమార్‌ డిప్లొమా మొదటి సంవత్సరం, సిద్దార్థ్‌ పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు తెలిపారు. పటాన్‌చెరులోని ప్రాచీన్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో మృతదేహాలను ఉంచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించారు. తోటి విద్యార్థులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను గురువారం ఉదయం 10 గంటల్లోపు పూర్తి చేసి, అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు అంబులెన్సుల్లో తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తన సొంత నిధులతో అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబరాబాద్‌ డీసీపీ శ్రీనివాస్‌ కూడా ఆస్పత్రికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. శివనగర్‌ చౌరస్తా సమీపంలోని పెద్దకంజర్లలో శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ మొదటి తరగతి నుంచి పాలిటెక్నిక్‌, బీటెక్‌ వరకు సుమారు 70 మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణంరాజు తన కుమార్తె శిరీష పేరు మీద ఈ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

22 hrs ago
user_MUKKAGALLA YADANNA
MUKKAGALLA YADANNA
Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
22 hrs ago
2ef81c7a-098c-480a-8f6d-88bf6be92078

వినాయక నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి నేరేడు చెరువులో మట్టి గుంతలు గుర్తించక నీటిలోకి దిగిన విద్యార్థులు విషాద ఘటనతో పెద్దకంజర్లలో విషాదఛాయలు పటాన్‌చెరు, శురు ప్రతినిధి సెప్టెంబర్‌ 16: వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దకంజర్లలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు విద్యార్థులు నీటిలోకి దిగారు. చెరువులో మట్టి కోసం తీసిన గుంతలు

3c5312fe-0179-40cd-b2e8-8f611287437b

ఉండటాన్ని గమనించకపోవడంతో లోతైన నీటిలోకి వెళ్లిన విద్యార్థులు ఈత రాక మునిగిపోయినట్లు సమాచారం. మృతులను నర్సింహా (21), తేజ (17), సిద్దంత్ (17), గణేష్ (18), సుమంత్ రెడ్డి (17), ఉదయ్ కిరణ్ (22) గుర్తించారు. వీరిలో సుమంత్‌, గణేష్‌ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్‌కిరణ్‌ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్‌కుమార్‌ డిప్లొమా మొదటి సంవత్సరం, సిద్దార్థ్‌ పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు

881bea1e-d153-4c26-9395-a8731723f807

తెలిపారు. పటాన్‌చెరులోని ప్రాచీన్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో మృతదేహాలను ఉంచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించారు. తోటి విద్యార్థులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను గురువారం ఉదయం 10 గంటల్లోపు పూర్తి చేసి, అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు అంబులెన్సుల్లో తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తన సొంత నిధులతో అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబరాబాద్‌ డీసీపీ శ్రీనివాస్‌ కూడా ఆస్పత్రికి చేరుకుని

56d742f4-3b2a-4f88-8def-eb3ce653e9ce

ఘటనపై వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. శివనగర్‌ చౌరస్తా సమీపంలోని పెద్దకంజర్లలో శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ మొదటి తరగతి నుంచి పాలిటెక్నిక్‌, బీటెక్‌ వరకు సుమారు 70 మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణంరాజు తన కుమార్తె శిరీష పేరు మీద ఈ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

More news from Telangana and nearby areas
  • తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం... బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    1
    తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం...
బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!*
తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది...
దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ..
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.!
ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న...
బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,..
నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది..
మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.!
సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ.
సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    5 hrs ago
  • నిజాంపేట మండల కేంద్రంలో గుంపులుగా కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ పలువురిని వెంబడిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కిరాణా సరుకులు చేతిలో పట్టుకుని వెళ్తున్న వారిని కోతులు వెంబడిస్తూ భయపెడుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    1
    నిజాంపేట మండల కేంద్రంలో గుంపులుగా కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు
నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ పలువురిని వెంబడిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కిరాణా సరుకులు చేతిలో పట్టుకుని వెళ్తున్న వారిని కోతులు వెంబడిస్తూ భయపెడుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    3
    సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి

సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    3
    గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు 
ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... 
కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....
    user_B N RAJU
    B N RAJU
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.
    1
    తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ 
తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా  జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    10 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి 
ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి
మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్  సింగ్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి...సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్... జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి , విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మాజీ జేపీటీసీ కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చక్రపాణి , రామప్ప , కౌన్సిలర్ లు సర్పంచ్ లు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి...సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్...
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి , విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మాజీ జేపీటీసీ కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చక్రపాణి , రామప్ప , కౌన్సిలర్ లు సర్పంచ్ లు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    7 hrs ago
  • జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
    1
    జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నా
చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు విద్యుత్ సమస్యపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • తెలంగాణ విముక్తితో ఈ ప్రాంత ప్రజలకు ప్రశాంతత లభించింది. తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది ఎంతోమంది పోరాటం చేసి నైజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు విముక్తి పొందిన రోజుగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాధవరెడ్డి వడ్ల నందు రాజేందర్రెడ్డి సతీష్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    1
    తెలంగాణ విముక్తితో ఈ ప్రాంత ప్రజలకు ప్రశాంతత లభించింది.
తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది ఎంతోమంది పోరాటం చేసి నైజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు విముక్తి పొందిన రోజుగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాధవరెడ్డి వడ్ల నందు రాజేందర్రెడ్డి సతీష్ వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.