logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.

16 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు.చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు.కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆందోళన పోరుమామిళ్ల బస్టాండ్ సమీప డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఫణిరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యూరింగ్ సరిగా చేయకపోవడం వల్ల ప్రజాధనం వృథా కావడంతోపాటు ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందన్నారు. దీనికి ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణా లోపమే కారణమని ఆరోపించారు. ఈ పనులపై జిల్లా కలెక్టర్ తక్షణమే సాంకేతిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
    1
    డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆందోళన
పోరుమామిళ్ల బస్టాండ్ సమీప డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఫణిరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యూరింగ్ సరిగా చేయకపోవడం వల్ల ప్రజాధనం వృథా కావడంతోపాటు ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందన్నారు. దీనికి ఆర్ అండ్
బి అధికారుల పర్యవేక్షణా లోపమే కారణమని ఆరోపించారు. ఈ పనులపై జిల్లా కలెక్టర్ తక్షణమే సాంకేతిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్
సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు,  సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    1
    లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన 
శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పుట్టపర్తి రోడ్డులో ఏర్పాటు లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులునిరసన చేస్తున్న  శాంతియుతంగా నిరసన చేపట్టారు. స్థానికంగా సుమారు 200 కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.
షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ తదితర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికుల సమస్యలపై స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అలాగే చిరు వ్యాపారస్తులు స్థానిక వ్యాపారాల ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతున్న కూడా స్థానిక మంత్రిగారు స్పందించకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
చట్టం ముందు అందరూ సమానమే. స్థానిక ఉపాధిని కాపాడండి... చట్టబద్ధ అనుమతులపై పారదర్శక విచారణ జరపండి.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    1
    సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.
బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    1
    మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని చిత్తూరు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు పట్టణంలో మంగళవారం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దోపిడీలు అక్రమాలు దౌర్జన్యాలు పెచ్చు మీరుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతి యువతి, యువకులను మోసం చేస్తూ దగాకోరు పాలన చేపడుతున్నారని, డీఎస్సీలో నిజాయితీగా పరీక్ష రాసిన అర్హుడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లించారో, అటువంటి అనహర్హులకు ఉద్యోగం కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అర్హులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అనర్హులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి  నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని చిత్తూరు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు పట్టణంలో మంగళవారం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దోపిడీలు అక్రమాలు దౌర్జన్యాలు పెచ్చు మీరుతున్నాయన్నారు.
నిరుద్యోగ యువతి యువతి, యువకులను మోసం చేస్తూ దగాకోరు పాలన చేపడుతున్నారని, డీఎస్సీలో నిజాయితీగా పరీక్ష రాసిన అర్హుడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లించారో, అటువంటి అనహర్హులకు ఉద్యోగం కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అర్హులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అనర్హులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి
కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ
తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్
పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో
విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అక్రమ ఆన్లైన్లు, అడ్డదారి రిజిస్ట్రేషన్లకు కేంద్ర బిందువుగా B.కోడూరు తాసిల్దార్ కార్యాలయం. బద్వేలు, జూలై: భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. దళారి వ్యవస్థను పెంచి పోషిస్తూ అక్రమ ఆన్లైన్లు, అడ్డదారిలో రిజిస్ట్రేషన్లుచేయిస్తున్న B.కోడూరు మండల రెవెన్యూ అధికారులపై మరియు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని CPI ML Liberation పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉదయం B.కోడూరు మండల తాసిల్దార్ రమణమ్మ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని B.కోడూరు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులే స్వయంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అక్రమ ఆన్లైన్లు, రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక, రాజకీయ, అంగబలం ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, అవినీతి నిర్మూలిస్తామన్న కూటమి ప్రభుత్వంవందల ఎకరాల కబ్జాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందని ప్రశ్నించారు. మద్దిమాను గురుప్ప స్వామి దేవాదాయ భూమి B.కోడూరు మున్నెల్లి గ్రామం సర్వే నెం. 39B లోని 2 ఎకరాల 33 సెంట్ల అత్యంత విలువైన స్థలాన్ని అధికార పార్టీ నేత అక్రమంగా రిజిస్టర్ చేయించి 2 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. అంకన గొడుగునూరు, చెన్నకేశపురం భూములు- తాసిల్దార్ కార్యాలయానికి దగ్గరలోని చెన్నకేశపురం సర్వే నెం. 2 లో 20 ఎకరాలకు పైగా భూమిని ఒక నేత ఆక్రమించి ఫెన్సింగ్ వేసి సాగు చేస్తున్నాడు. నెలన్నర క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. పదే పదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదని, డబ్బులు ఇచ్చిన వారి వైపే రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. బాధితుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని, త్వరలోనే బాధితులతో కలిసి రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించేఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు పేదల పక్షాన నిలబడతారో లేక కబ్జాదారులకు సహకరిస్తారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చంద్రమోహన్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు K. జకరయ్య, B.కోడూరు మండల కార్యదర్శి మార్క్, నాయకులు నారాయణ, చిన్నయ్య, జేమ్స్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
    1
    అక్రమ ఆన్లైన్లు, అడ్డదారి రిజిస్ట్రేషన్లకు కేంద్ర బిందువుగా B.కోడూరు తాసిల్దార్ కార్యాలయం.
బద్వేలు, జూలై:
భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.
దళారి వ్యవస్థను పెంచి పోషిస్తూ అక్రమ ఆన్లైన్లు, అడ్డదారిలో రిజిస్ట్రేషన్లుచేయిస్తున్న B.కోడూరు మండల రెవెన్యూ అధికారులపై మరియు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని CPI ML Liberation పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉదయం B.కోడూరు మండల తాసిల్దార్  రమణమ్మ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని  B.కోడూరు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులే స్వయంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అక్రమ ఆన్లైన్లు, రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక, రాజకీయ, అంగబలం ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, అవినీతి నిర్మూలిస్తామన్న కూటమి ప్రభుత్వంవందల ఎకరాల కబ్జాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందని ప్రశ్నించారు.
మద్దిమాను గురుప్ప స్వామి దేవాదాయ భూమి B.కోడూరు మున్నెల్లి గ్రామం సర్వే నెం. 39B లోని 2 ఎకరాల 33 సెంట్ల అత్యంత విలువైన స్థలాన్ని అధికార పార్టీ నేత అక్రమంగా రిజిస్టర్ చేయించి 2 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు.
అంకన గొడుగునూరు, చెన్నకేశపురం భూములు- తాసిల్దార్ కార్యాలయానికి దగ్గరలోని చెన్నకేశపురం సర్వే నెం. 2 లో 20 ఎకరాలకు పైగా భూమిని ఒక నేత ఆక్రమించి ఫెన్సింగ్ వేసి సాగు చేస్తున్నాడు. నెలన్నర క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు.
పదే పదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదని, డబ్బులు ఇచ్చిన వారి వైపే రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు.
బాధితుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని, త్వరలోనే బాధితులతో కలిసి రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించేఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. 
రెవెన్యూ అధికారులు పేదల పక్షాన నిలబడతారో లేక కబ్జాదారులకు సహకరిస్తారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చంద్రమోహన్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు K. జకరయ్య, B.కోడూరు మండల కార్యదర్శి మార్క్, నాయకులు నారాయణ, చిన్నయ్య, జేమ్స్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥 ✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽 నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥 ✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
    1
    నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥

✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥
✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.