logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బిక్కనూరులో భారీ వర్షం... రైతుల హర్షం......... ( వీడియో) బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్న దశలో వర్షాలు కురవడం పంటలకు ఊతమిచ్చింది.

10 hrs ago
user_Mahesh Nakka
Mahesh Nakka
Kamareddy, Hyderabad•
10 hrs ago

బిక్కనూరులో భారీ వర్షం... రైతుల హర్షం......... ( వీడియో) బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్న దశలో వర్షాలు కురవడం పంటలకు ఊతమిచ్చింది.

More news from తెలంగాణ and nearby areas
  • తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా
రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి ఆకస్మిక తనిఖీ*

*చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన*
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. 
చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. 
ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోంది యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజాంపేటలో ఆమె మాట్లాడుతూ.. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోందని ఆరోపించారు. యాప్‌లో సాంకేతిక సమస్యలతో బుకింగ్ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    1
    యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోంది 
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజాంపేటలో ఆమె మాట్లాడుతూ.. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోందని ఆరోపించారు. యాప్‌లో సాంకేతిక సమస్యలతో బుకింగ్ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    32 min ago
  • *అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన* *జువ్వడి కృష్ణారావు* *మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్*
    1
    *అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన* 
*జువ్వడి కృష్ణారావు* *మున్సిపల్ చైర్ పర్సన్  తిరుమల వసంత గంగాధర్*
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • లోక కల్యాణార్థం రామకోటి లిఖిత మహాయజ్ఞం రాంసాగర్‌లో భద్రాచల రామకోటి పుస్తకాల పంపిణీ చేసిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు* లోకకల్యాణమే లక్ష్యంగా, శ్రీరామ నామమే శక్తిగా శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పానికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఆదివారం రాయిపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ రామనామం పలికే, లిఖించే ప్రతి హృదయం పవిత్రమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ, లిఖిస్తూ ఈ మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల లిఖిత శ్రీరామ నామాలను పూర్తి చేసి భద్రాచలానికి సమర్పించడమే మహా సంకల్పమని, ఇది కేవలం లిఖిత యజ్ఞం మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించే మహోద్యమమని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు. రామాలయ అధ్యక్షులు ఎనిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ తమ గ్రామ భక్తులకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, శ్రావణ్, బిక్షపతి, మెట్టయ్య, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    లోక కల్యాణార్థం రామకోటి లిఖిత మహాయజ్ఞం

రాంసాగర్‌లో భద్రాచల రామకోటి పుస్తకాల పంపిణీ చేసిన

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*
లోకకల్యాణమే లక్ష్యంగా, శ్రీరామ నామమే శక్తిగా శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పానికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఆదివారం రాయిపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ రామనామం పలికే, లిఖించే ప్రతి హృదయం పవిత్రమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ, లిఖిస్తూ ఈ మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల లిఖిత శ్రీరామ నామాలను పూర్తి చేసి భద్రాచలానికి సమర్పించడమే మహా సంకల్పమని, ఇది కేవలం లిఖిత యజ్ఞం మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించే మహోద్యమమని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు.
రామాలయ అధ్యక్షులు ఎనిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ తమ గ్రామ భక్తులకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, శ్రావణ్, బిక్షపతి, మెట్టయ్య, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    1
    NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా.         
బుక్క ఇస్మాయిల్  
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఆదివారం సీఐటీయూ టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్ , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*
    2
    కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి
పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి
ఆదివారం  సీఐటీయూ  టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ  , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్  , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు.. రైతులకు తప్పని ఇబ్బందులు నర్సాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి యాప్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు.. రైతులకు తప్పని ఇబ్బందులు
నర్సాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి యాప్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు
    1
    కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.