సిరివెళ్లలో జిల్లా పరిషత్ హై స్కూల్‌కు పూర్వ విద్యార్థులు బ్యాచ్ (1978-1979) నుంచి జిరాక్స్ యంత్రం అందజేత నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన హెచ్.ఎం. ఎన్. గోవిందరాజ్, ఇన్చార్జి హెచ్.ఎం. జి జాఫర్ 21-04-2026న పూర్వ విద్యార్థులు అందజేసిన జిరాక్స్ యంత్రాన్ని స్వీకరించారు. 1978-1979 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి పాఠశాల అభివృద్ధి దృష్ట్యా ఈ యంత్రాన్ని అందించడం విశేషం.ఈ సందర్భంగా హెచ్.ఎం. గోవిందరాజ్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించిన ఈ జిరాక్స్ యంత్రం పాఠశాల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని తెలిపారు.యంత్రాన్ని అందించిన కె. ఖాజా, కె. నజీర్, పి. రషీద్ ఖాన్, ఎన్. గురు స్వామి గార్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం. గోవిందరాజ్, ఇంచార్జి హెచ్.ఎం. జి జాఫర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
సిరివెళ్లలో జిల్లా పరిషత్ హై స్కూల్‌కు పూర్వ విద్యార్థులు బ్యాచ్ (1978-1979) నుంచి జిరాక్స్ యంత్రం అందజేత నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన హెచ్.ఎం. ఎన్. గోవిందరాజ్, ఇన్చార్జి హెచ్.ఎం. జి జాఫర్ 21-04-2026న పూర్వ విద్యార్థులు అందజేసిన జిరాక్స్ యంత్రాన్ని స్వీకరించారు. 1978-1979 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి పాఠశాల అభివృద్ధి దృష్ట్యా ఈ యంత్రాన్ని అందించడం విశేషం.ఈ సందర్భంగా హెచ్.ఎం. గోవిందరాజ్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించిన ఈ జిరాక్స్ యంత్రం పాఠశాల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని తెలిపారు.యంత్రాన్ని అందించిన కె. ఖాజా, కె. నజీర్, పి. రషీద్ ఖాన్, ఎన్. గురు స్వామి గార్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం. గోవిందరాజ్, ఇంచార్జి హెచ్.ఎం. జి జాఫర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Hi1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.1