కప్పట్రాల్లా గ్రామంలో పింఛన్ పంపిణీ – సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జమ్మ ఆలూరు: దేవనకొండ మండలంలోని కప్పట్రాల్లా గ్రామంలో రాష్ట్ర వాల్మీకి/బోయ సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి కప్పట్రాల్లా బొజ్జమ్మ శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని బొజ్జమ్మ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
కప్పట్రాల్లా గ్రామంలో పింఛన్ పంపిణీ – సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జమ్మ ఆలూరు: దేవనకొండ మండలంలోని కప్పట్రాల్లా గ్రామంలో రాష్ట్ర వాల్మీకి/బోయ సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి కప్పట్రాల్లా బొజ్జమ్మ శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని బొజ్జమ్మ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- గత వైకాపాలనలో ప్రతిపక్ష నేతగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ ఇప్పుడు సమర్పించడం ఏంటి రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రైతులతో భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రైతుల భూములకు రక్షణ ఏది అంటూ అడ్డుకోవడం జరిగిందని బిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నే నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటూ అదే ప్రాజెక్టును సమర్తించడంఏంటంటూ ప్రశ్నించారు. రైతుల భూములకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.2
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- సోమలాపురంలో తాగునీటి వృధాను అరికట్టండి మహాప్రభో అంటున్న ప్రజలు డి హిరేహాల్ మండలం సోమలాపురం గ్రామంలో రోడ్లపై వృధాగా త్రాగునీరు వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటంటూ స్థానికులు పేర్కొన్నారు. వైయస్సార్ విగ్రహం ముందు పైప్ లీకేజీ కారణంగా భారీగా నీరు వృధాగా రోడ్లపై వెళుతోందని పేర్కొన్నారు. సచివాలయం ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలబడటంతో అటుగా వెళుతున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే నీటి వృధా ని అరికట్టాలని వారు కోరుతున్నారు.1