Shuru
Apke Nagar Ki App…
మెదక్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ పట్టణంలోని 26 వార్డు లో అదనపు కలెక్టర్ నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమన్నీ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ దొంతి నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MERCY
మెదక్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ పట్టణంలోని 26 వార్డు లో అదనపు కలెక్టర్ నగేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమన్నీ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ దొంతి నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- Post by Narasimulu Narasimulu1
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం క్రీడలతో ఒత్తిడి దూరం మెదక్ జిల్లా ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు పోలీసు వార్షిక క్రీడోత్సవాలను (Annual Sports & Games) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ జెండా ఆవిష్కరించి క్రీడా పోటీలకు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడోత్సవాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ పరిశీలించి సిబ్బంది నుంచి వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించి విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. అదేవిధంగా క్రీడా పోటీలు సిబ్బందిలో ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. విధుల్లో ఎంత నిబద్ధతతో పనిచేస్తారో, అదే ఉత్సాహంతో క్రీడల్లో కూడా పాల్గొని ప్రతిభ కనబరచాలని సూచించారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ముగింపు కార్యక్రమంలో బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1