logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, పునరావాసం, కాలువల నిర్మాణం, అటవీశాఖ అనుమతుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. జల సౌదా కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, పునరావాస కమిషనర్ శివకుమార్, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, భూసేకరణ, నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణ, అటవీ అనుమతులు, భూ యజమానులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఈ సంవత్సరం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేయాలని, కలెక్టర్ల వద్ద పి.డి. ఖాతాలో ఉన్న నిధులను వెంటనే భూ యజమానులకు చెల్లించాలని, అవార్డు పాసులు, పరిపాలన అనుమతులు, క్షేత్రస్థాయి పరిశీలన త్వరగా చేపట్టాలని ఆదేశించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, పునరావాసం కల్పించడంతో పాటు అటవీ భూముల అనుమతుల పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

17 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
17 hrs ago
13deb13e-173a-4474-9fd2-f4f221ed20d5

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, పునరావాసం, కాలువల నిర్మాణం, అటవీశాఖ అనుమతుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. జల సౌదా కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, పునరావాస కమిషనర్ శివకుమార్, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, భూసేకరణ, నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణ, అటవీ అనుమతులు, భూ యజమానులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఈ సంవత్సరం 6 వేల

37b6c233-d9d9-4825-b6ad-871e6fb2be65

కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేయాలని, కలెక్టర్ల వద్ద పి.డి. ఖాతాలో ఉన్న నిధులను వెంటనే భూ యజమానులకు చెల్లించాలని, అవార్డు పాసులు, పరిపాలన అనుమతులు, క్షేత్రస్థాయి పరిశీలన త్వరగా చేపట్టాలని ఆదేశించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, పునరావాసం కల్పించడంతో పాటు అటవీ భూముల అనుమతుల పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే కంపా సీసీఎఫ్ క్షితిజ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    4
    పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే

కంపా సీసీఎఫ్ క్షితిజ
సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు.... అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు .... ఎమ్మెల్యే గెలవక ముందు హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి 
ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు....
అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే
ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి 
ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు ....
ఎమ్మెల్యే గెలవక ముందు  హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే 
గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది 
గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన
ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు.
గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    1
    పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు
పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు.
విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.
క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
    1
    *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత*

తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల
*ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత*
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు  ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    22 min ago
  • బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    4
    బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ
జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష
పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
  • సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట  కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే
తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    1 hr ago
  • హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    1
    హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.