మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడంతో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రైతుల భూములపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు ఇండస్ట్రియల్ పార్కులు త్రిబుల్ ఆర్ రోడ్డు మూసి ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని వికారాబాద్ ప్రాంతంలో బిఆర్ఎస్ కార్యకర్తలను అకారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడంతో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రైతుల భూములపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు ఇండస్ట్రియల్ పార్కులు త్రిబుల్ ఆర్ రోడ్డు మూసి ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని వికారాబాద్ ప్రాంతంలో బిఆర్ఎస్ కార్యకర్తలను అకారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడంతో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రైతుల భూములపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు ఇండస్ట్రియల్ పార్కులు త్రిబుల్ ఆర్ రోడ్డు మూసి ప్రాజెక్టు పేరుతో రైతుల భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని వికారాబాద్ ప్రాంతంలో బిఆర్ఎస్ కార్యకర్తలను అకారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 'సేఫ్ మదర్స్ డే' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని చెప్పారు. గర్భ గర్భధారణ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- Post by Ali ammu1
- ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- Post by Vishwamber Rao1
- పత్రిక ప్రకటన తేది :08.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి పరిధిలోని పల్లె దవాఖాన శాబ్ధిపూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం (VHNSD) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, కలెక్టర్ సమక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ (TB), లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రవీందర్ గౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు , మెడికల్ ఆఫీసర్, డీపీఓ పద్మజ , స్థానిక సర్పంచ్ , మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.1
- సంగారెడ్డి లోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శివరం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు సదరం శిబిరానికి భారీగా హాజరయ్యారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వైద్యులు దివ్యాంగులను పరీక్షించారు. అర్హులైన వారికి సర్టిఫికెట్లను అందిస్తామని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.2