logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

5 hrs ago
user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
Bollam Saireddy జయం న్యూస్ మీడ
Interior designer Manakondur, Karimnagar•
5 hrs ago
125bf8e5-0d1b-4071-823d-e0d3230c24a2

ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    3
    కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర
మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు. స్వీట్ హౌస్ నిర్వాహకుడు డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.
    2
    జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో  మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు.
స్వీట్ హౌస్ నిర్వాహకుడు  డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు.
మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో  మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    2
    ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన
రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
    1
    శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    4
    *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు*

*కోడెల మృతిపై విచారణకు ఆదేశం*

*నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు*
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.  బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు...
ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.
గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.
ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని  స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు..
వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    11 hrs ago
  • కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు కోడెల మృతిపై విచారణకు ఆదేశం నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు.ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    1
    కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు
కోడెల మృతిపై విచారణకు ఆదేశం
నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.  బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు.ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని  స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా*
* రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి.
ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.