logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పినపాక నియోజకవర్గానికి రూ.70 కోట్ల పంచాయతీరాజ్ నిధులు...మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా HAM లో రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్కకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి రామయ్య స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రూ.70 కోట్ల నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సులభంగా వెళ్లేందుకు, ప్రజలు వైద్య సేవల కోసం ఆసుపత్రులకు చేరుకునేందుకు, రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగిపొర్లిన సమయంలో రాకపోకలకు ఏర్పడే ఇబ్బందులు తగ్గి, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు సైతం సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పినపాక నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రాబోయే రోజుల్లోనూ పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు.

7 hrs ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
7 hrs ago
f5b9c293-eb79-4fc9-b986-7370e50bb5f2

పినపాక నియోజకవర్గానికి రూ.70 కోట్ల పంచాయతీరాజ్ నిధులు...మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా HAM లో రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్కకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి రామయ్య స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో రహదారులు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రూ.70 కోట్ల నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సులభంగా వెళ్లేందుకు, ప్రజలు వైద్య సేవల కోసం ఆసుపత్రులకు చేరుకునేందుకు, రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగిపొర్లిన సమయంలో రాకపోకలకు ఏర్పడే ఇబ్బందులు తగ్గి, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు సైతం సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పినపాక నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రాబోయే రోజుల్లోనూ పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • మధ్యప్రదేశ్‌ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన మగ శిశువు . *మధ్యప్రదేశ్‌:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    1
    మధ్యప్రదేశ్‌ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన
మగ శిశువు
.
*మధ్యప్రదేశ్‌:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 min ago
  • రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌ ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి?

మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌
ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
    1
    భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి.....................
భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
  • సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    1
    సారు.. పింఛను ఇప్పించండి..?*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. 
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
*సెంటర్:- అశ్వారావుపేట*
*స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?*
*యాంకర్ వాయిస్:*
పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
*వాయిస్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది.
నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది.
*వాయిస్*
నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది.
ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది.
*వాయిస్*
కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు.
*వాయిస్*
నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది.
*వాయిస్ ఓవర్*
నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.


ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.
    1
    కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు.
సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు
కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు  కోరారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.