నాగారం లో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాల పంపిణీ నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాగారం లో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాల పంపిణీ నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య
అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్
మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్‌టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.4
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by నీరటి మహేందర్1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1
- సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.2