Shuru
Apke Nagar Ki App…
విద్యుదాఘాతానికి గురైన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన చీపురుపల్లి మండలంలో జరిగింది. మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు గురువారం ఉదయం సూర్యఘర్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో లోటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చీపురుపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
B.RAJESH
విద్యుదాఘాతానికి గురైన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన చీపురుపల్లి మండలంలో జరిగింది. మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు గురువారం ఉదయం సూర్యఘర్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో లోటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చీపురుపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మెలియాపుట్టి, ఏప్రిల్ 23: మెలియాపుట్టి మండలంలోని స్థానిక షిరిడి సాయి ఆలయంలో షిరిడి సాయిబాబా తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రాంతం మొత్తం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన దాతలు కాళ్ల రామారావు–పార్వతి దంపతులు ఆధ్వర్యం వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పాల్గొని ప్రత్యేక దర్శనం పొందారు. అనంతరం సాయిబాబా విగ్రహానికి పుష్పాలంకరణ చేసి మహా మంగళహారతి నిర్వహించారు.వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఉత్సవ శోభ మరింత పెరిగింది. సాయంత్రం భజన మండళ్లు భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. పిల్లలు, యువత పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా దాతలు కాళ్ల రామారావు మాట్లాడుతూ, సాయిబాబా ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు ఐక్యంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పార్వతి దంపతులు భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం మీద ఈ వార్షికోత్సవం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.1
- 🙏😭1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- మహబూబాబాద్, ఏప్రిల్ __: నేటి సమాజంలో యువతలో పెరుగుతున్న డ్రగ్స్, మద్యం వినియోగం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మగ పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబాల పాత్ర, బాధ్యతలపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో యువతలో మత్తు పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, చదువు మరియు ఉద్యోగ ఒత్తిడి, పర్యవేక్షణ లోపం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా “స్టేటస్ సింబల్” భావనతో మగ పిల్లలు మద్యం, డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రారంభంలో అలవాటుగా మొదలయ్యే ఈ వినియోగం, తరువాత తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది యువత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం, కొత్త స్నేహితులపై దృష్టి పెట్టడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వంటి సంకేతాలను గుర్తించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం, భావోద్వేగంగా అండగా నిలవడం కీలకమని చెబుతున్నారు. అదేవిధంగా, పిల్లలను క్రీడలు, హాబీలు, నైపుణ్యాల అభివృద్ధి వైపు దారితీసేలా ప్రోత్సహించడం, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం, అవసరమైతే కౌన్సిలింగ్ సహాయం పొందడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను కేవలం కుటుంబ స్థాయిలో కాకుండా సమాజం మొత్తం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. యువత దేశ భవిష్యత్తు కావడంతో, వారిని మత్తు బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని సమాచారం. ఈ ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన శంకర్ గౌడ్‌ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నర్సంపేట డిపోలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- 🙏😭1
- Post by Ramprasad islavath1
- అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.1