Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ సాగునీటి ముక్తేశ్వరం.. మన కాళేశ్వరం. ఎవరు ఔనన్నా కాదన్నా... తెలంగాణకు ప్రాణేశ్వరం.. ముమ్మాటికీ కాళేశ్వరమే!
Ramprasad islavath
తెలంగాణ సాగునీటి ముక్తేశ్వరం.. మన కాళేశ్వరం. ఎవరు ఔనన్నా కాదన్నా... తెలంగాణకు ప్రాణేశ్వరం.. ముమ్మాటికీ కాళేశ్వరమే!
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao2
- నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..! గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.1
- వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.1
- నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ... హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య... పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ.... కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం... మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ... సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన... ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్... కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు... రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన... అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు.. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.1
- Post by Ramprasad islavath1
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.1
- Post by Syyed taher1