Shuru
Apke Nagar Ki App…
ఆర్టిసి కార్మికులారా త్యాగాలు వద్దు సంయమనం పాటించండి ప్రభుత్వం మీతో చర్చలు జరుపుతుంటే ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం విచారకరం. కాంగ్రెస్ స్పందించే ప్రభుత్వమే కాని బందించే ప్రభుత్వం కాదు *డాక్టర్ కోటూరి మానవతారాయ్*
Ramprasad islavath
ఆర్టిసి కార్మికులారా త్యాగాలు వద్దు సంయమనం పాటించండి ప్రభుత్వం మీతో చర్చలు జరుపుతుంటే ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం విచారకరం. కాంగ్రెస్ స్పందించే ప్రభుత్వమే కాని బందించే ప్రభుత్వం కాదు *డాక్టర్ కోటూరి మానవతారాయ్*
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.1
- హైదరాబాద్ : సాంగ్ విషయమై సుదర్శన్ థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగిన ప్రభాస్ ఫ్యాన్స్. ఫ్యాన్స్‌పై థియేటర్ సిబ్బంది దాడి చేసే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ మూవీ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన గొడవ ఇది. సుదర్శన్ థియేటర్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్.1
- మహబూబాబాద్, ఏప్రిల్ __: నేటి సమాజంలో యువతలో పెరుగుతున్న డ్రగ్స్, మద్యం వినియోగం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మగ పిల్లలు ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబాల పాత్ర, బాధ్యతలపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో యువతలో మత్తు పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, చదువు మరియు ఉద్యోగ ఒత్తిడి, పర్యవేక్షణ లోపం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా “స్టేటస్ సింబల్” భావనతో మగ పిల్లలు మద్యం, డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రారంభంలో అలవాటుగా మొదలయ్యే ఈ వినియోగం, తరువాత తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది యువత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం, కొత్త స్నేహితులపై దృష్టి పెట్టడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వంటి సంకేతాలను గుర్తించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం, భావోద్వేగంగా అండగా నిలవడం కీలకమని చెబుతున్నారు. అదేవిధంగా, పిల్లలను క్రీడలు, హాబీలు, నైపుణ్యాల అభివృద్ధి వైపు దారితీసేలా ప్రోత్సహించడం, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం, అవసరమైతే కౌన్సిలింగ్ సహాయం పొందడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను కేవలం కుటుంబ స్థాయిలో కాకుండా సమాజం మొత్తం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. యువత దేశ భవిష్యత్తు కావడంతో, వారిని మత్తు బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని సమాచారం. ఈ ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన శంకర్ గౌడ్‌ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నర్సంపేట డిపోలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.1
- Post by Ramprasad islavath1